వైయస్ వివేక హత్య కేసు విచారణ వేగవంతంగా జరుగుతూ ఉంది.దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈనెల 30వ తారీకు కేసు విచారణ మొత్తం కంప్లీట్ చేయాలని CBIకి ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ కేసులో ఆదివారం ఉదయం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి( MP YS Avinash Reddy ) తండ్రి వైయస్ భాస్కర రెడ్డిని( YS Bhaskara Reddy ) అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు.దీంతో ఆయనను హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇక ఇదే కేసులో సీబీఐ నాలుగు సార్లు అవినాష్ రెడ్డిని విచారించడం జరిగింది.కాగా తాజాగా మరోసారి అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయడం జరిగింది.హైదరాబాదులోని సీబీఐ కార్యాలయంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులలో తెలియజేయడం జరిగింది.దీంతో రేపు ఏం జరుగుతుందో అన్నది ఉత్కంఠ భరితంగా మారింది.
మొదటి నుండి ఈ కేసులో అవినాష్ రెడ్డి పేరు వినపడుతూ ఉంది.







