ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ విచారణ కొనసాగుతోంది.దాదాపు ఆరు గంటలకు పైగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
సీఆర్పీసీ 161 కింద కేజ్రీవాల్ ను సీబీఐ ప్రశ్నిస్తోందని తెలుస్తోంది.సాక్షిగానే ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆరా తీస్తున్నారు.మద్యం పాలసీ రూపకల్పనతో పాటు అమలులో జరిగిన అక్రమాలు, కమీషన్ రేట్లను పెంచడం, రూ.100 కోట్ల ముడుపులపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.అదేవిధంగా విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తుంది.మనీశ్ సిసోడియా సహా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం కేజ్రీవాల్ ఆమోదం, సౌత్ గ్రూప్ తో సంబంధాలపై సీబీఐ ప్రశ్నిస్తుంది.







