మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు హైదరాబాద్ కు తరలించారు.ఈ నేపథ్యంలో ఉస్మానియాలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయనను సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.
దీంతో న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.మరోవైపు భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని న్యాయమూర్తికి విన్నవించారు.అటు సీబీఐ భాస్కర్ రెడ్డికి కస్టడీకి ఇవ్వాలని కోరింది.
ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి భాస్కర్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.







