ఈ ప్రకృతిలో ఎన్నో వింతలు దాగున్నాయి.రోజూ మామూలుగా కనిపించే కొన్ని ప్రకృతి దృశ్యాలు ఒక్కోసారి చాలా వింతగా కూడా మారుతుంటాయి.
అరుదుగా చోటు చేసుకునే ఈ ప్రకృతి పరిణామాలు మన దృష్టి పడకుండా కనుమరుగు కాలేవు.అలాంటి ఒక అరుదైన వింత కర్ణాటకలో( Karnataka ) వెలుగు చూసింది.
ఉత్తర కన్నడ జిల్లా అంకోలాలోని ఒక రైతు పెరటి తోటలో ఈ విచిత్రం కనిపించింది.ఇంతకీ ఏంటా విచిత్రం అనుకుంటున్నారా.
సాధారణంగా పనస పండ్ల( Jackfruit ) ఆకారం మామిడిపండ్ల లాగా ఉంటుంది.అయితే బండికట్టె పెరటి తోటలో మాత్రం ఒక పనస చెట్టుకు జీడిపప్పు ఆకారంలో పండ్లు కాసాయి.

దీన్ని చూసి తోట యజమాని బండికట్టె మహాబలేశ్వర్( Bandikatte Mahabaleshwar ) అవాక్కయ్యారు.తర్వాత ఈ విషయం గురించి ఆ నోటా ఈ నోటా పడి ఊరంతా తెలిసింది.దాంతో చాలామంది ప్రజలు ఈ వింతను చూసేందుకు తండోపతండాలుగా తరలివచ్చారు.వింత ఆకారంలో పండ్లను కాస్తున్న ఈ చెట్టు కొన్ని ఏళ్ల నుంచి మహాబలేశ్వర్ అనే రైతు ఇంటి పెరట్లో పెరుగుతోంది.
అయితే ఈ పండి ఆకారం ఒక మిస్టరీగా మారింది.దీనికి గల కారణమేంటనేది ఇప్పటివరకైతే తెలియ రాలేదు.

జీడిపప్పు ఆకారపు పనస పండ్లు ప్రపంచంలో కనిపించడం చాలా అరుదు.అయితే కొన్ని జాక్‌ఫ్రూట్ చెట్లు ఆకారంలో జీడిపప్పును పోలి ఉండే పండ్లను ఉత్పత్తి చేస్తాయి.ఇది జన్యు సమస్యలు లేదా పర్యావరణ కారకాల వల్ల సంభవించవచ్చు.ఇక వేరే పండ్లు కూడా వెరైటీ షేపుల్లో కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి.జపాన్‌లో చతురస్రాకారపు పుచ్చకాయలు పండుతాయి.వీటిని రవాణా చేయడం చాలా సులభం.
ఎలిఫెంట్ యాపిల్స్ ఉష్ణమండలంలో పెరిగే ఒక రకమైన పండు.కొన్నిసార్లు, ఈ పండ్లు ఏనుగు పాదం లేదా పెద్ద పుచ్చకాయ వంటి అసాధారణ పరిమాణం, ఆకృతికి పెరుగుతాయి.
ఇంకా ఎన్నో వింతలు ఈ ప్రపంచంలో చోటు చేసుకుంటున్నాయి.







