పరిటాల తనయుడు విజయం ఆయన మీద ఆధారపడి ఉందా?

రాజకీయంగా పాపులర్ అయిన స్థానాలలో అనంతపురం జిల్లాలోని ధర్మవరం కూడా ఒకటి ఇప్పుడు ఆ నియోజకవర్గంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( Kethireddy Venkatrami Reddy ) ఎమ్మెల్యే గా ఉన్నారు .ఆయన తన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ద్వారా కూడా సుపరిచితులు… ప్రతిరోజు పొద్దున్నే నియోజకవర్గ ప్రజలను కలుసుకుని వారి సాధకబాధకాలను ఓపికగా విని వాటిని పరిష్కరిస్తుంటారని పేరు తెచ్చుకున్నారు .

 Is Varadapuram Suri Support To Paritala Son Paritala Sriram Details, Paritala Sr-TeluguStop.com

ఒక రకంగా ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఈయనే గెలుస్తారని కూడా వార్తలువస్తున్నాయి ,,, అయితే ఆయన చేసేదంతా ఒట్టి షో మాత్రమేనని ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆయన తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారంటూ తెలుగుదేశం విమర్శలు చేస్తుంది .

ఇటీవల పాదయాత్రలో లోకేష్ ( Nara Lokesh ) ఆయన ఆక్రమించుకున్న భూములను కామెరాల సాక్షిగా కూడా చూపించారు అయితే తెలుగు దేశం తరుపున ఈ నియోజక వర్గ బాద్యతలను ప్రస్తుతం పరిటాల శ్రీరామ్( Paritala Sriram ) చూస్తున్నారు.ఆయన తనకంటూ ఒక వర్గాన్నిఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు.ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా తో తెలుగుదేశం పార్టీ ఉందని అందుకే ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా కూడా లోకేష్ పాదయాత్రలో పరిటాల శ్రీరామ్ కు టికెట్ కన్ఫామ్ చేశారని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.

Telugu Ap, Kethivenkatrami, Lokesh, Paritala Sriram-Telugu Political News

అయితే పరిటాల శ్రీరామ్కు ఇంతకు ముందు ఈ సీటు నుంచి పోటీ చేసిన వరదాపురం సూరి( Varadapuram Suri ) నుంచి ముప్పు తప్పదని వార్తలు వస్తున్నాయి.2019 ఎన్నికలలో కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ఓడిపోయినప్పటికీ వరదాపురం సూరి బలమైన కాండిడేట్ అని 2009లో ఇండిపెండెంట్గా పోటీ చేసిన్నప్పుడే ఆయన 42 వేల పై చిలుకు వోట్లు తెచ్చుకున్నారని కేవలం జగన్ వేవ్ కారణంగానే 2019 లో ఓడిపోయారని అధికార పార్టీ వేదింపులు తట్టుకోలేక బిజెపి తీర్థం పుచ్చుకున్నప్పటికీ,

Telugu Ap, Kethivenkatrami, Lokesh, Paritala Sriram-Telugu Political News

2024 ఎన్నికలకు ముందు మళ్ళీ టిడిపి నుంచి పోటీ చేసే ఆలోచనతో ఆయన ఉన్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.మరి ఆ టికెట్ ఇప్పుడు పరిటాల శ్రీరామ్కి ఇచ్చినందున ఆయన ఆయన మళ్లీ ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశాలుఆయన అనుచరులు చెప్తున్నారు….ఈ పరిస్థితులలో తెలుగుదేశం అధిష్టానం రంగంలోకి దిగి వరదాపురం సూరిని బుజ్జగించకపోతే పరిటాల శ్రీరామ్ విజయం కష్టమవుతుందని అంచనాలు వస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube