ఒకప్పటి స్టార్ హీరోయిన్ శోభన( Shobana ) గురించి మనందరికీ తెలిసిందే.ఈ తరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోయినప్పటికీ ఆతరం ప్రేక్షకులు శోభన ని ఇట్టే గుర్తుపట్టేస్తారు.1980 నుంచి 1986 వరకు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది శోభన.అంతేకాకుండా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
మొదట అక్కినేని నాగార్జున ( Akkineni Nagarjuna )నటించిన విక్రమ్ సినిమా( Vikram movie )తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది శోభన.

కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం తమిళ హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది.తెలుగులో విజృంభణ, అజేయుడు, మువ్వగోపాలుడు, అభినందన, రుద్రవీణ, అల్లుడు గారు, రౌడీ గారి పెళ్లాం, రౌడీ అల్లుడు లాంటి సినిమాలలో నటించింది.కాగా శోభన కేవలం నటి మాత్రమే కాదండోయ్ క్లాసికల్ డాన్సర్ కూడా.
ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభన తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాల గురించి ఆమె పంచుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రజినీకాంత్( Rajinikanth ) తో శివ సినిమా సెట్ లో జరిగిన సంఘటన గురించి ఆమె తెలిపింది.
ఈ సందర్భంగా హీరోయిన్ శోభన మాట్లాడుతూ.

రజనీకాంత్‌తో శివ, దళపతి సినిమాల్లో నటించాను.అయితే శివ చిత్రం షూటింగ్‌లో వర్షం పాట చిత్రీకరించడానికి సెట్ వేశారు.ఆ విషయం నాకు తప్ప అక్కడున్న వారందరికీ తెలుసు.
శరీరం కనిపించేలా ఉన్న ఒక తెల్ల చీర ఇచ్చి నన్ను కట్టుకోమని చెప్పారు.అప్పుడు నేను వెంటనే కాస్ట్యూమ్ బాయ్‌ని పిలిచి చీర చాలా పల్చగా ఉంది.
ఇంటికెళ్లి లోపల ఏదైనా ధరించి దానిపై కట్టుకుని వస్తాను అని చెప్పాను.అయితే షూట్‌కు ఎక్కువ సమయం లేకపోవడంతో ఏం చేయాలో అర్థం కాలేదు.
అప్పుడు ఇక చేసేదేమిలేక అక్కడే ఉన్న ఒక టేబుల్ కవర్‌ని ఒంటికి చుట్టుకున్నాను.దానిపై చీర కట్టుకుని షూట్‌కి రెడీ అయిపోయాను.
ఆ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కవర్ సౌండ్‌కు రజనీకాంత్ చాలా ఇబ్బంది పడ్డారు.ఆరోజు నేను టేబుల్ కవర్ ధరించానని ఎవరికీ తెలియదు.
నాకు తెలిసి రెయిన్ సాంగ్స్ అంటే హీరోయిన్స్‌ను మర్డర్ చేసినట్టే అని నవ్వుతూ తెలిపింది శోభన.







