దక్షిణాది సినీ ఇండస్ట్రీలో బుట్ట బొమ్మగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూజా హెగ్డే (Poojahedge) వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈమెకు బాలీవుడ్ అవకాశాలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం వరుస బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ పూజ ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే గత ఏడాది పూజా హెగ్డే తెలుగు తమిళ భాషలలో నటించిన సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అయ్యాయి.
ఇలా నాలుగు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పూజా హెగ్డే కు నాలుగు సినిమాల నుంచి నిరాశ తప్పలేదు.
సాధారణంగా వరుస ఫ్లాప్స్ వస్తే కనుక అలాంటి సెలబ్రిటీలకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి.
కానీ పూజ హెగ్డే విషయంలో అందుకు భిన్నం అని చెప్పాలి.ఈమెకు వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడిన వరుసగా అవకాశాలు రావడం విశేషం.
తాజాగా ఈమె సల్మాన్ ఖాన్ (Salman Khan) సరసన నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ (Kisi Ka Bhai Kisi Ki Jaan) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న పూజా హెగ్డే మొదటిసారి తన ప్లాప్ సినిమా సర్కస్ (Cirkus) గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ నేను నటించే ప్రతి ఒక్క సినిమాని సొంత బిడ్డ లాగా భావిస్తాను.సర్కస్ చిత్రాన్ని కూడా అలాగే భావించి నటించాను.అయితే ఈ సినిమా పరాజయం పాలవడంతో చాలా బాధపడ్డాను అని పూజ హెగ్డే తెలిపారు.

ఈ సినిమా నన్ను నిరుత్సాహపరిచినప్పటికీ తాను రోహిత్ శెట్టి (Rohith Shetty) దర్శకత్వంలో పనిచేసినందుకు చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను.ఇక ఈ సినిమాలో ఎంతోమంది గొప్ప నటీనటులతో స్క్రీన్ షేర్ చేసుకున్నాను.ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలోని నా పాత్ర అందరికీ నచ్చింది.నా పాత్రకు ఎంతో మంచి పేరు వచ్చిందని ఈ సందర్భంగా పూజా హెగ్డే తాను నటించినా సర్కస్ సినిమా ఫెయిల్యూర్ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







