పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు బీ ఆర్ ఎస్ అధినేత , తెలంగాణా సీఎం కేసీఆర్( CM KCR ) భారీగానే ప్లాన్ చేస్తోంది.రాబోయే లోక్ సభ ఎన్నికల నాటికి వివిధ రాష్ట్రాల్లో బలం పుంజుకుని వీలైనన్ని ఎక్కువ సీట్లు సంపాదించే విధంగా వ్యూహాలు రచిస్తూ, చేరికలపై ఎక్కువగా ఫోకస్ చేసింది.
ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర లలో బీఆర్ఎస్ బలపడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నట్లుగా ఆ పార్టీ అధినేత కేసిఆర్ అంచనా వేస్తున్నారు.ముఖ్యంగా మహారాష్ట్రలో ( Maharashtra ) పార్టీ బలపడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా కేసీఆర్ అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ ( BRS ) భారీ సభలను మహారాష్ట్రలో నిర్వహించారు.మూడో సభను మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈనెల 24వ తేదీన నిర్వహించేందుకు నిర్ణయించారు.

ఈ మేరకు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు.ఆ బహిరంగ సభ రోజునే మహారాష్ట్రకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో కేసీఆర్ సమక్షంలో చెరబోతున్నట్టు సమాచారం.బిజెపి , శివసేన, ఎన్సిపి , శివ సంగ్రామ్ పార్టీ, మహారాష్ట్ర నవనిర్మాణ సేన తదితర పార్టీల నుంచి భారీగా నాయకులు కార్యకర్తలు చేరబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ముఖ్యంగా తెలంగాణ సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర జిల్లాలతో పాటు, తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలపైన బీఆర్ఎస్ ఎక్కువగా దృష్టి సారిస్తోంది.
ముఖ్యంగా లాతూర్, నాందేడ్, యువత్మాల్ , చంద్రా పూర్, షోలాపూర్ , ఔరంగాబాద్, ఉస్మానాబాద్, బీడ్, నాసిక్ జిల్లాలపై దృష్టి సారించింది.ఈ ప్రాంతాల నుంచి పార్టీలో ఎక్కువగా చేరికలు ఉండబోతున్నట్లు సమాచారం.

ఔరంగాబాద్ తర్వాత మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం లేదా షోలాపూర్ లో మరో భారీ బహిరంగ సభను నిర్వహించి పెద్ద ఎత్తున చేరికలు ఉండేవిధంగా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్సు తివారితో పాటు, బీఆర్ఎస్ రైతు విభాగం మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు మాణిక్ కదమ్ వ్యవహరిస్తున్నారు.ఇక ఔరంగాబాద్ సభకు సంబంధించి మహారాష్ట్రలో నిన్ననే సన్నాహక సమావేశం కూడా నిర్వహించారు.బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మధ్, ఐడిసి చైర్మన్ వేణుగోపాలా చారి, మహారాష్ట్ర , బీహార్ ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు , మాజీ ఎమ్మెల్యే శంకరన్న డోంగే తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.







