వరంగల్ లో బీజేపీ తలపెట్టిన నిరుద్యోగ మార్చ్ మరికాసేపటిలో ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో కేయూ జంక్షన్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు పోలీసులు భారీగా మోహరించారు.
మరోవైపు వరంగల్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.నిరుద్యోగ మార్చ్ ప్రాంతానికి బయటి వాహనాలను రాకుండా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు.
నిరుద్యోగ మార్చ్ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలంతా వరంగల్ కు చేరుకున్నారు.కాగా సుమారు 10 వేల మంది నిరుద్యోగ మార్చ్ లో పాల్గొంటారని బీజేపీ వెల్లడించింది.







