ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు ఈడీ దాఖలు చేసిన రెండో అనుబంధ ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
అయితే ఈ అనుబంధ ఛార్జ్ షీట్ పై ఈనెల 24వ తేదీ నుంచి వాదనలు కొనసాగనున్నాయి.మాగుంట రాఘవ, గౌరవ్ మల్హోత్రా, రాజీవ్ జోషికి చెందిన కంపెనీలపై ఈనెల 6న ఈడీ అభియోగపత్రం దాఖలు చేసింది.