గుడివాడ పర్యటన సందర్భంగా తనపై విమర్శలుచేసిన చంద్రబాబు( Chandrababu ) కు భారీ స్థాయిలో రిటార్ట్ ఇచ్చారు గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ).అంబేద్కర్ జయంతి( Ambedkar Jayanti ) రోజున చంద్రబాబు లాంటి 420 గురించి మాట్లాడాల్సివస్తుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ….
నిమ్మకూరు( Nimmakuru ) పై ఈ స్థాయిలో ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు అసలు నిమ్మకూరుకు చేసిందేమిటంటూ ఆయన ప్రశ్నించారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏలుబడి చేసిన చంద్రబాబు పేదలకు ఒక్క ఎకరం భూమి అయినా ఇక్కడ కొన్నారా ? కొన్నట్టు నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని వాఖ్యానించారు .నిమ్మకూరు పై ప్రేమ జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )మాత్రమే ఉంటుందని ఎందుకంటే ఆయన మాత్రమే ఇక్కడ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడని ఇక్కడ 25 ఎకరాలు భూమి కూడా కొనుకున్నాడని ఆయనకు తప్ప నందమూరి కుటుంబ సభ్యులు ఎవరికీ ఇక్కడ సెంటు భూమి కూడా లేదంటూ ఆయన చెప్పుకొచ్చారు.
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి( Chief Minister Jagan Mohan Reddy ) అంటూ విమర్శలు చేస్తున్న తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పేరు మీద ఉన్న ఆస్తులు విలువ ఎంతో తెలుసా అంటూ ఆయన ప్రశ్నించారు జగన్ దంపతుల ఆస్తులు కన్నా చంద్రబాబు దంపతులు ఆస్తులు ఎక్కువ అని తన భార్యా ఆస్తులను తనవి కాదని చెప్పుకునే నీచ స్థితి లో చంద్రబాబు ఉన్నారని ఆయన దుయ్యబట్టారు నిమ్మకూరు కు హరికృష్ణ చాలా చేశారని, ఆ తర్వాత ఎన్టీఆర్ మాత్రమే నిమ్మకూరు ప్రజలను పట్టించుకుంటారని ఈ సందర్భంగా గుడివాడని చెప్పారు.

60 లక్షల రూపాయల ఖర్చు పెట్టి తాను జూనియర్ ఎన్టీఆర్ కలిపి ఎన్టీఆర్ దంపతులకు కాంస్య విగ్రహాలను 2013 లో ఇక్కడ నిలబెట్టామని సిగ్గు లేకుండా ఇప్పుడు చంద్రబాబు వాడికి దండలు వేస్తున్నారంటూ ఆయన వాఖ్యానించారు మరి చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసింది కొడాలి నాని తెలుగుదేశం శ్రేణుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి
.







