రాజన్న సిరిసిల్ల జిల్లా :దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ ఎస్పీ అఖిల్ మహాజన్ కొనియాడారు.సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
పట్టణంలోని డా బి ఆర్ అంబేద్కర్ చౌక్ లో డా బి ఆర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహానికి జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందంకళా చక్రపాణి, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య , ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, దళిత సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డా బి ఆర్ అంబేద్కర్ జయంతి సభ నిర్వహించారు.
జయంతి సందర్భంగా డా బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.బర్త్ డే కేక్ ను అతిథులు,దళిత సంఘాల కట్ చేశారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ…డా బి ఆర్ అంబేద్కర్ ప్రపంచంలోనే పేరొందిన గొప్ప న్యాయవాది, మానవతా వాది అని పేర్కొన్నారు.లండన్ లో ప్రముఖ విశ్వ విద్యాలయం డా బి ఆర్ అంబేద్కర్ కు మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్ ప్రధానం చేసిందన్నారు.
ఆర్థిక శాస్త్రంలో మొదటి పీహెచ్డీ చేసిన వ్యక్తి డా బి ఆర్ అంబేద్కర్ రే నని చెప్పారు.అన్ని అంశాల్లో పట్టున్న గొప్ప సామాజిక సంఘ సంస్కర్త డా బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.
రాజ్యాంగ రూపకల్పన లో కీలకమైన ముసాయిదా కమిటీ కి చైర్మన్ గా వ్యవహరించారనీ చెప్పారు.దేశానికి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము ను రాసి భవిష్యత్తులో దేశం ఎదుర్కొనే అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు చూపారని ఎస్పీ కొనియాడారు.
దేశానికి డా బి ఆర్ అంబేద్కర్ చేసిన సేవలు ఎనలేనివనీ కొనియాడిన ఎస్పీ అఖిల్ మహాజన్.డా బి ఆర్ అంబేద్కర్ కలలు గన్న దేశంగా, సూపర్ పవర్ గా భారత్ ఎదగాలంటే రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు అత్యుత్తమ అభివృద్ధి సాధించాలని చెప్పారు.
అనంతరం జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ ఆకునూరి మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కుల మతా లకు అతీతంగా, లింగ బేధం లేకుండా, ధనిక పేద అనే తారతమ్యం లేకుండా వయోజునులైన ప్రతీ ఒక్కరి పా లకులను ఎన్నుకునే ఓటు హక్కును కల్పించిన మహో న్నతుడు భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని కీర్తించారు.సమ సమాజ నిర్మాణం కోసం అన్ని వర్గాల ప్రజలు అర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు రిజర్వేషన్ తీసుకొచ్చాడని అన్నారు.
హైదరాబాద్ లో సచివాలయం సమీపంలో మహా విగ్రహం ఏర్పాటు తో భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు.నూతన రాష్ట్ర సచివాలయం కు భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయం అన్నారు.
ప్రభుత్వాలు పేదల కోసం సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నాయంటే అది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానేనని అన్నా రు.భారతరత్న డా బి ఆర్ అంబేద్కర్ ఆలోచన అమలుకు సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.డా బి ఆర్ అంబేద్కర్ అడుగు జాడల్లో నడుస్తూ రాష్ట్ర మంత్రి కే తారకరామారావు సిరిసిల్ల రూపు రేఖలు మార్చారని అన్నారు.అలాగే జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ బడుగు , బలహీన వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం డా బి ఆర్ అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు.
వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.అలాగే సెస్ చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ డా బి ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.వీరితో పాటు దళిత సంఘాల ప్రతినిధులు దేశానికి , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన సేవలను తమ ప్రసంగాల్లో కొనియాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య , ఎస్సి కార్పొరేషన్ ఈడి డా.వినోద్,డిడబ్ల్యూఓ లక్ష్మీ రాజం, స్థానిక కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.







