తల్లిని బంధించి, దివ్యాంగురాలైన కుమార్తె( disabled daughter ) పై ఓ మెకానిక్( మెకానిక్ ) అత్యాచారానికి పాల్పడిన ఘటన కేరళలోని ఇడుక్కి లో( Idukki in Kerala ) చోటుచేసుకుంది.బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇడుక్కి తోడుపుజ సమీపంలో ఉండే కరీంకున్నం లో ఓ తల్లి తన దివ్యాంగురాలైన కూతురితో కలిసి జీవనం సాగిస్తోంది.వీరి ఇంట్లో వస్తువులను రిపేర్ చేయడానికి మను( Manu ) అనే వ్యక్తి వచ్చాడు.
ఇంట్లో బాధితురాలు (46), వృద్ధురాలైన ఆమె తల్లి మాత్రమే ఉండడం గమనించిన మను కాసేపు చుట్టుపక్కల పరిసరాలను గమనించి ఆ తరువాత ఆ వృద్ధురాలిని పక్క రూమ్ లో బంధించి తాళం వేశాడు.

అనంతరం ఆ దివ్యాంగురాలిపై అత్యాచారం చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.బాధితురాలి తల్లి వెంటనే బాధితురాలిని తోడుపుజ ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించింది.తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడు మను ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.

బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితున్ని కోర్టులో హాజరు పరిచారు.బాధితురాలు తల్లి న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇవ్వడంతో నిందితుడిని రిమాండ్ కు తరలించాలని పోలీసులు తెలిపారు.

దీనిపై స్థానికులు స్పందిస్తూ ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చి, కఠిన శిక్షలు విధిస్తూ ఉన్న కూడా సమాజంలో తిరిగే కామాందులలో కాస్తయినా మార్పు రాకపోగా ఇలాంటి దారుణాలు క్రమంగా పెరుగుతున్నాయని ఆవేదన చెందారు.ఇటువంటి నిందితులను నేరం రుజువైతే వెంటనే ఉరితీయాలని అప్పుడే ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు రక్షణ కలుగుతుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఇక బాధితురాలు తల్లి, తన ముందే కూతురిని అత్యాచారం చేస్తుంటే కాపాడుకోలేకపోయానని, ఆ నిందితున్ని కఠినంగా శిక్షించాలని కోరింది.








