పవర్ స్టార్ 'ఓజి'లో హీరోయిన్ ఫిక్స్.. ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లైనప్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్ ”ఓజి”(OG Movie).ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తోనే ఈ సినిమా తెరకెక్కబోతుంది.

 Nani's Heroine To Act In Pawan Kalyan's Movie, Ustaad Bhagat Singh, Pawan Kalyan-TeluguStop.com

త్వరలోనే సెట్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) తెరకెక్కించ బోతున్నాడు.ప్రజెంట్ పవన్ ఫుల్ స్వింగ్ లో షూటింగ్ లలో పాల్గొంటున్నాడు.

ఒకదాని తర్వాత మరో సినిమా షూట్ లో గ్యాప్ లేకుండా పాల్గొంటూ తన లైనప్ ను పూర్తి చేసుకుంటున్నాడు.

ముందుగా పవన్ రీమేక్ మూవీ వినోదయ సీతం (Vinodhaya Sitham) సినిమాను పూర్తి చేసాడు.కేవలం 22 రోజుల డేట్స్ లోనే తన పార్ట్ షూట్ పూర్తి చేసాడు.ఇక ఈ సినిమా తర్వాత ఏప్రిల్ 5న హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) సినిమా స్టార్ట్ చేసాడు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అవ్వగానే ఓజి సినిమాను స్టార్ట్ చేయబోతున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి.

అయితే సుజీత్ డైరెక్టర్ చేస్తున్న ఈ సినిమా నుండి ఇంత వరకు నటీనటుల వివరాలు బయటకు రాలేదు.కానీ తాజాగా ఈ సినిమా హీరోయిన్ గురించి ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.ఈ సినిమాలో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ లో నటించి మెప్పించిన ప్రియాంక మోహన్ (Priyanka Arul Mohan) నటించనున్నట్టు తాజాగా టాక్ వస్తుంది.

అంతేకాదు ఈమె ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లోనే జాయిన్ అవ్వబోతున్నారట.

మరి ఇదే కనుక నిజం అయితే ఈ భామకు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.ఈ హీరోయిన్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాను డివివి దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ పై భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఆడియెన్స్ లో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఇలాంటి కొత్త కొత్త అప్డేట్ లతో ఈ సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది అనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube