కర్నాటకలో అదే సీన్ రిపీట్.. నో డౌట్ !

కర్నాటక ఎలక్షన్స్( Karnataka Elections ) దగ్గరపడుతున్నాయి.మరో 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతుండడంతో ఈసారి కన్నడ నాటా గెలిచేదెవ్వరు అనే దానిపై సర్వత్ర ఆసక్తికంగా మారింది.

 Who Won In Karnataka , Jds, Congress , Bjp, Karnataka Elections, People's Pulse-TeluguStop.com

ప్రస్తుతం అక్కడున్న రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ప్రధాన పార్టీల మద్య హోరహోరీ పోరు నడిచే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాంగ్రెస్, బీజేపీ ( Congress , BJP)మద్య ఈసారి టాఫ్ ఫైట్ ఉండడంతో పాటు ఈసారి జెడిఎస్ ( JDS )కూడా ఆ రెండు పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.

దాంతో గెలుపుకోసం ప్రధాన పార్టీలు అమలు చేస్తున్న వ్యూహాలు, ప్రణాళికలు కన్నడ నాటా పోలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.

Telugu Congress, Karnataka, Peoples Pulse, Won Karnataka-Politics

ఇదిలా ఉంచితే ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.సర్వేల కోలాహలం సర్వసాధారణం.సర్వేలను బట్టే గెలుపై ఓ అంచనకు వస్తుంటారు రాజకీయ నేతలు.

అయితే అన్నీ సంబర్భాల్లో సర్వేల ఫలితాల్లో ఎన్నికల్లో కనిపిస్తాయనుకోవడం కూడా ముర్కత్వమే.సర్వేల ఫలితాలు తారుమారు అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఇదిలా ఉంచితే గత కొన్ని రోజులుగా కర్నాటకలో రోజుకొసర్వే పుట్టుకొస్తు ప్రజా నాడీని తెలిపే ప్రయత్నం చేస్తున్నాయి.కొన్ని సర్వేలు బిజెపికి అధికారాన్ని కట్టబెడితే, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ కు పట్టం కడుతున్నాయి.

ఇంకొన్ని సర్వేలు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రాదని హంగ్ ఏర్పడుతుందని చెబుతున్నాయి.దీంతో కర్నాటకలో గెలుపెవరనేది చెప్పడం అంత తేలికైన విషయం కాదు.

Telugu Congress, Karnataka, Peoples Pulse, Won Karnataka-Politics

అయితే మెజారిటీ సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశం ఉందనే చెబుతున్నాయి.తాజాగా నిర్వహించిన పీపుల్స్ పల్స్ సర్వే( People’s Pulse Survey ) కూడా ఇదే స్పస్టం చేసింది.కర్నాటక లోని 224 అసెంబ్లీ స్థానాలకు గాను మ్యాజిక్ ఫిగర్ 113 స్థానాలు ఏ పార్టీకి దక్కే అవకాశం లేదని, కాంగ్రెస్ కు 95-105 స్థానాలు, బిజెపికి 92 స్థానాలు, జెడిఎస్ కు 27 స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆ సంస్థ వెల్లడించింది.దాంతో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రానందున హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువ అని చెబుతుంది పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ.

కాగా గతంలో 2018లోనూ ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం రానందువల్ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది.ఈసారి కూడా అదే సీన్ రిపీట్ అయిన ఆశ్చర్యం లేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే హంగ్ ఏర్పడితే జెడిఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది.మరి ఈ సారి కన్నడ ప్రజల తీర్పు ఎలా ఉండబోతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube