నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandannaa) ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.
ఈ క్రమంలోనే ఈమె చేసే కొన్ని పోస్టుల వల్ల పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి.అయితే వీటి గురించి పెద్దగా పట్టించుకోని రష్మి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను తెలియజేస్తూ ఉంటారు.

ఇకపోతే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ తాను ఇంకా ఐపీఎల్ (IPL) హ్యాంగోవర్ నుంచి బయట పడలేదని వెల్లడించారు.ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా తమన్నాతో కలిసి రష్మిక పలు డాన్స్ చేస్తూ సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే ఐపీఎల్ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈమె తాను ఇంకా ఈ ఐపిఎల్ హ్యాంగోవర్ నుంచి బయటపడలేకపోతున్నానని తెలియజేశారు.ఇందులో భాగంగా ఈమె క్రికెటర్ ధోని (Dhoni)తో కలిసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశారు.

ఇలా ధోని ఫోటోని షేర్ చేయడంతో ఆయన అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 (Pushpa 2) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అలాగే నితిన్ సరసన మరోసారి సందడి చేయబోతున్నారు ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాలో కూడా నటించారు.
ఇలా భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఈమె ఎంతో బిజీగా గడుపుతున్నారు.







