ప్రముఖ జ్యోతిష్యుడుగా ఎంత పేరు సంపాదించుకున్న వేణు స్వామి(Venu Swamy) ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.గత కొద్దిరోజుల క్రితం ఈయన మద్యం(Alcohol) మాంసం సేవిస్తానని తెలియజేశారు.
తాజాగా తాను చేసే పూజలు గురించి కూడా కొన్ని విషయాలను తెలియచేశారు.తాను కేవలం సెలబ్రిటీలకు మాత్రమే జాతకాలు చెబుతానని చాలామంది అనుకుంటారు.
తాను సామాన్యులకు కూడా జాతకాలు చెబుతానని వేణు స్వామి వెల్లడించారు.

ఇక తాను నెలలో కేవలం పది రోజులు మాత్రమే జాతకాలు చెబుతానని ఆ పది రోజుల్లో కూడా రోజుకు పది మంది తన టార్గెట్ అంటూ వేణు స్వామి తెలియజేశారు.20 రోజులు తన వ్యక్తిగత జీవితాన్ని గడపడం కోసం ఇతర పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్తూ తన జీవితాన్ని గడుపుతానని ఈయన తెలియజేశారు.ఇకపోతే తాను చేసే పూజల గురించి వేణు స్వామి మాట్లాడుతూ… తాను పూజలు చేసే సమయంలో మద్యం మాంసం(Nonveg) నైవేద్యంగా పెడతానని తెలిపారు.

ఇక నేను ఎవరి ఇంట్లో అయితే పూజ చేశానో వారికి ఆ మద్యం తాగిస్తానని ఈ సందర్భంగా వేణు స్వామి చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.దీంతో ఈయన ఇదివరకే పలువురు సినీ హీరోయిన్ల ఇళ్లలో పూజలు చేశారు వారికి కూడా మద్యం తాగించారని తెలుస్తోంది.ఇకపోతే తాను త్వరలో ఒక పబ్ (Pub) కూడా తెరవబోతున్నానని వేణు స్వామి తెలిపారు.అదేంటి మీరు ప్రారంభించడం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా ఈయన సమాధానం చెబుతూ నేను స్వామీజీని కాదు అలాగే గురూజీని కాదు.
నా జాతకంలో ఆల్కహాల్ వ్యాపారం అయితే బాగుంటుందని ఉంది అందుకే త్వరలోనే పబ్ ప్రారంభించబోతున్నాను అంటూ ఈ సందర్భంగా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







