మెగాస్టార్ ( Megastar ) ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉండడం వల్ల వరుస సినిమాలను చేస్తున్నాడు.ఇటీవలే సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya ) చిరు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి పోయింది.
ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మెగాస్టార్ మరో సినిమాతో బిజీగా ఉన్నాడు.ప్రజెంట్ చిరు ( Chiranjeevi ) భోళా శంకర్ ( Bhola Shankar ) సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉండగా మెగాస్టార్ మరో సినిమాను లైన్లో పెట్టారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ( Vassisht Mallidi ) దర్శకత్వంలో మెగాస్టార్ తన నెక్స్ట్ సినిమాను చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేసాయి.

ఇక ఈ డైరెక్టర్ బింబిసార ( Bimbisara ) వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.గత ఏడాది వచ్చిన బింబిసార సినిమాతో నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) కూడా తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.మరి అలాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ కు బిగ్ ప్రొడక్షన్ హౌస్ లలో భారీ ఆఫర్స్ వస్తున్నాయి.అయితే ఈయన నెక్స్ట్ మూవీ ఇంకా ప్రకటించలేదు.

ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా మల్లిడి వశిష్ట తన నెక్స్ట్ సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నాడు అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.ఈ వార్తలు నిజమో కాదో ఇంకా తెలియలేదు కానీ ఈ యంగ్ డైరెక్టర్ తో సినిమా అంటే వద్దే వద్దు అంటున్నారు చరణ్ ఫ్యాన్స్ ( Ram Charan fans ).ఎందుకంటే రామ్ చరణ్ ( Ram Charan ) ను ట్రోల్ చేసిన ఒక ట్వీట్ ను ఈ డైరెక్టర్ లైక్ చేసినట్టు ఫ్యాన్స్ కనుకొన్నారు.దీంతో ఫ్యాన్స్ ఈయన ప్రొఫైల్ ను లాక్ చేయడమే కాకుండా ఈయనతో సినిమాకు ఓకే చేయవద్దని చిరును కోరుకుంటున్నారు.
మరి దీనిపై ఈ యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.







