బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కంటెస్టెంట్ అఖిల్( Akhil ) గురించి అందరికీ సుపరిచితమే.రెండుసార్లు ఈయన బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన రెండుసార్లు ఈ కార్యక్రమంలో రన్నర్ గా నిలిచారు.
ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అఖిల్ అనంతరం తేజస్వి ( Tejaswi )మదివాడతో కలిసి బీబీ జోడి( BB Jodi )లో సందడి చేశారు అయితే వీరి పర్ఫామెన్స్ చూసిన అనంతరం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకొని అఖిల్ తాజాగా ఒక షాకింగ్ న్యూస్ వెల్లడించారు.

సోషల్ మీడియా వేదికగా అన్ని విషయాలను పంచుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న అఖిల్ కొంతకాలం పాటు సోషల్ మీడియాకు( Social Media ) దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారట.ఈ క్రమంలోనే ప్రస్తుతం తనకు తన సంతోషం,తనకు మనశ్శాంతి ఎంతో అవసరమని భావించిన అఖిల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు.ఇకపై కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాలో ఏ విధమైనటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ రావని, బ్రాండ్ కమిట్మెంట్లకు సంబంధించిన వీడియోలను నా టీం పోస్ట్ చేస్తుందనీ తెలిపారు.

ఈ క్రమంలోనే తాను ఇకపై ఇన్స్టాగ్రామ్ ఇతర సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉండబోతున్నానని తెలియజేశారు.సోషల్ మీడియా అంటేనే ఒక ఫేక్ ప్రపంచమని ఈయన తెలియజేశారు.నా ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ ను సంతోషంగా ఉంచడం కోసమే స్టోరీలు పెడుతున్నా అయితే నేను సంతోషంగా లేకపోయినా సంతోషంగా ఉన్నానని పోస్టులు పెట్టాను.
ఇకపై అలా చేయలేనని తెలిపారు.అందుకే కొన్ని రోజులపాటు ఈ అబద్ధపు ప్రపంచానికి దూరంగా ఉంటూ ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండాలని అనుకుంటున్నాననీ అఖిల్ సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్న విషయాన్ని వెల్లడించారు.
ప్రస్తుతం అఖిల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







