మంచు మనోజ్, భూమా మౌనిక( Manchu Manoj, Bhuma Maunika) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.తాజాగా మనోజ్, మౌనిక వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలా మొదలైంది షోకు హాజరయ్యారు.
ఈ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.ధీంతనన ధీంతనన సాంగ్ బ్యాగ్రౌండ్ లో ప్లే అవుతుండగా మనోజ్, మౌనిక ఎంట్రీ ఇచ్చారు.
మనోజ్, వెన్నెల కిషోర్( Vennela Kishore ) ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకోగా ఈ పాట మా ఇద్దరి కోసం కాదు మీ ఇద్దరి కోసం వేశారని తెలిపారు.

వెన్నెల కిషోర్ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి అని అడగగా మనోజ్ ఏం తెలుసుకోవాలని ఉంది? అని చెప్పగా ఎవ్రీథింగ్ అని కిషోర్ చెబుతాడు.మనోజ్ వెంటనే ష్యూరా అని అడగగా షాకైన వెన్నెల కిషోర్ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు.అసలు మీరిద్దరు మొదట ఎలా కలిశారు అని కిషోర్ అడగగా బబుల్స్ వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాయి మనస్సులో నుంచి అని మనోజ్ చెప్పాడు.

మీ ఇద్దరిలో రొమాంటిక్ ఎవరు అని అడగగా మనోజ్ వెంటనే మనమే అని చెప్పాడు.ఆ తర్వాత ఏం జరిగిందని కిషోర్ అడగగగా అలా మొదలైందని మౌనిక కమెంట్లు చేశారు.మౌనిక రచయిత కూడా మచ్చ అని మనోజ్ తెలిపారు.మనోజ్ గారి కంటే తనకు కోపం ఎక్కువని మౌనిక పరోక్షంగా చెప్పుకొచ్చారు.ఉప్పెన సినిమాలోని ఈశ్వరా సాంగ్ తరహాలో మేము అలా దేశదేశాలు తిరిగామని మనోజ్ కామెంట్లు చేశారు.

సినిమాలో ఈశ్వరా సాంగ్ 5 నిమిషాలే అని మాకు సంవత్సరాలు ఉండిందని మనోజ్ చెప్పుకొచ్చారు.అమ్మ చనిపోయిన తర్వాత పుట్టినరోజున ఆకాశం చూస్తూ అంతా అమ్మకే వదిలేస్తున్నా అన్నానని ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకు వచ్చాడని మౌనిక పేర్కొన్నారు.లవ్ లైఫా, సినిమానా సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మనోజ్ అన్నారు.
మనల్ని నమ్ముకుని బిడ్డతో ఒక అమ్మాయి నిలబడిందని ఆమెకు అన్యాయం చేస్తే నేను బ్రతికి కూడా వేస్ట్ ఈ జన్మకు అని అనిపించిందని మనోజ్ అన్నారు.మనోజ్ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.







