కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ విశాఖకు చేరుకున్నారు.ఈ క్రమంలో ఆయనకు బీజేపీ శ్రేణులు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం పలికారు.
అనంతరం కేంద్ర సహాయమంత్రి ఫగ్గన్ సింగ్ రోడ్డు మార్గాన క్లాసిక్ ఆఫీసర్స్ గెస్ట్ హౌజ్ కి వెళ్లారు.
ఇవాళ వైజాగ్ లో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో మంత్రి చర్చలు జరపనున్నారు.మరోవైపు కేంద్రం చేస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో కేంద్రమంత్రి పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.







