తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరుచూరి బ్రదర్స్ (Parchuri Brothers)సినీ ప్రస్థానం ఎలాంటిదో మనకు తెలిసిందే.పరుచూరి గోపాలకృష్ణ (Parachuri Gopalakrishna) పరుచూరి వెంకటేశ్వరరావు ఇద్దరు సినీ రచయితలుగా దాదాపు 300 సినిమాలకు కథలను అందించారు.
అలాగే పలు సినిమాలలో నటులుగా నటించడమే కాకుండా దర్శకులుగా కూడా పనిచేశారు.ఇక ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావు(Parachuri Venkatwswararao) వయసుపై పడటంతో ఈయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ గోపాలకృష్ణ మాత్రం ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం విడుదలవుతున్న సినిమాల గురించి ఆయన విశ్లేషణ ఇస్తూ వీడియోలను చేస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి గోపాలకృష్ణ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.నా దర్శకత్వంలో శోభన్ బాబు హీరోగా ఒక సినిమా చేశాను.ఈ సినిమా చేస్తున్నప్పుడు రామానాయుడు గారు సురేష్ బాబు గారు ఎంతో అద్భుతమైన డైలాగ్స్ రాస్తారని తనని మెచ్చుకోవడమే కాకుండా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పారు.ఇలా వారు చెప్పిన విధంగానే శోభన్ బాబు హీరోగా నాదర్శకత్వంలో వచ్చిన సినిమా సూపర్ హిట్ అయింది.
ఈ సినిమా హిట్ అవడంతో త్రివిక్రమ్ రావు, అశ్వినీ దత్ వంటి వారు డబ్బు కట్టలు నా ముందు పెట్టి తమ బ్యానర్ లో సినిమా చేయాలని కోరారు.

ఆరోజు కనుక నేను ఆ డబ్బు తీసుకొని ఉంటే శంకరంపల్లిలో 100 ఎకరాల భూమి నా సొంతం అయ్యేది.అప్పుడు ఎకరం 10 వేల రూపాయలు మాత్రమే.సురేష్ బాబు నా పక్కన ఉండి మీ అన్న వెంకటేశ్వరరావుని ఈ డబ్బు తీసుకోమని చెప్పు నేను కూడా అక్కడ భూమి కొన్నా మీ అన్నదమ్ములకు చెరో 50 ఎకరాలు కొనిస్తానని భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని చెప్పారు.
అయితే అప్పుడు మా అన్నయ్య అందుకు ఒప్పుకోలేదు వాడు దర్శకుడు అయితే నేను ఫిడేలు వాయించుకోవాలా అన్నారు.ఇలా అన్నయ్య మాట విని నేను డబ్బులు తీసుకోలేదు.
అలా తీసుకోకపోవడం వల్లే 100 ఎకరాల భూమిని కోల్పోయానని,ఆ తర్వాత ఈ విషయంలో అన్నయ్య చాలా బాధపడ్డారు అంటూ ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







