వైరల్: తన వాహనానికి అడ్డం వచ్చిందని ఏకంగా కారునే ఎత్తిపడేసిన వ్యక్తి?

పట్టణాల్లో, పైగా రోడ్లు అంతగా వెడల్పు లేని చోట్లా డ్రైవింగ్‌( Driving ) చేయడమంటే మహా చికాగ్గా ఉంటుంది.నిత్యం రహదారుపై ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లే( Traffic jam ) మనకు కనిపిస్తాయి.

 Viral: The Man Who Suddenly Threw His Car Because His Vehicle Got Blocked ,vehic-TeluguStop.com

ఓ అరగంట ప్రయాణానికి ఒక్కోసారి రెండు గంటలు సమయం పడుతుంది అంటే అతిశయోక్తి కదూ.ఇక పార్కింగ్‌ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.వాహనాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుండటంతో బైక్‌, కారు పార్కింగ్‌( Bike , car parking ) చేసేందుకు స్థలమే దొరక్క కష్టంగా మారుతున్న పరిస్థితి.ఒకవేళ పార్కింగ్ స్థలం దొరికినా.

కొంతమంది తమ వాహనాలను పార్క్‌ చేసే తీరు చూస్తే విపరీతమైన కోపం కలుగుతుంది.

గవర్నమెంట్స్ సంగతి సరే.కానీ మనోళ్లకు వ్యక్తిగత బాధ్యత కూడా ఉండదు.ఈ క్రమంలోనే తాజాగా కారు పార్కింగ్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.

రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్‌ చేసిన కారును ఓ వ్యక్తి తన 2 చేతులతో అమాంతం ఎత్తి పక్కకు జరిపాడు.వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే, ఇరుకుగా ఉన్న రోడ్డు మీద వరుసగా కొన్ని కార్లు పార్క్‌ చేసి ఉండడం చూడవచ్చు.

వాటిలో మారుతీ సుజుకీ వ్యాగనార్‌ కారు( Maruti Suzuki Wagoner car )ను అడ్డదిడ్డంగా పార్క్‌ చేయడం గమనించవచ్చు.

దాంతో అటుగా వెళుతున్న వాహనాలకు అది ఇబ్బందిగా మారింది.కారును దాటుకుంటూ వెళ్లడం కష్టంగా మారడంతో ఇవతలివైపు ఎస్‌యూవీ కారులో వెళ్తున్న ఓ వ్యక్తికి తిక్కలేచి వెంటనే కారులో నుంచి కిందకు దిగి ఆ పార్క్‌ చేసిన కారు వద్దకు వెళ్లి ఎవరి సాయం లేకుండానే దాదాపు 850 కిలోల బరువున్న కారును కేవలం తన రెండు చేతులతో ఎత్తి పక్కకు నెట్టాడు.దీనికి సంబంధించిన వీడియో మల్టీవీల్స్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ షేర్‌ చేయడంతో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

అతగాడిని నెటిజన్లు బాహుబలి అని కీర్తిస్తున్నారు.కొంతమంది అడ్డదిడ్డంగా పార్క్ చేసిన కారు ఓనర్ ని యేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube