మనలో అందరూ టాక్స్ పేయర్స్( TAX Payers ) కాకపోవచ్చు కానీ, ఈ విషయం తెలుసుకోవడం అందరికీ ముఖ్యం.అయితే ముఖ్యంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవలసిందే.
అవును, ఇపుడు పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయపు పన్ను శాఖ( Income Tax ) ప్రత్యేకంగా యాప్ రూపొందించింది.దీని ద్వారా మీరు చెల్లించాల్సిన పన్ను ఎంత? ఎంత టీడీఎస్ రీఫండ్ రావాలి? గత ఆర్థిక సంవత్సరంలో మీ మొత్తం ఆదాయం ఎంత? అదేవిధంగా వేర్వేరు మార్గాల్లో ఎంత సంపాదిస్తున్నారు? ఈ వివరాలన్నీ ఇపుడు ఒకే యాప్‌లో తెలుసుకోవచ్చు.
ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్ (AIS for Taxpayer) పేరుతో ఈ యాప్ అందుబాటులోకి రావడం గమనార్హం.ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవచన్న విషయం తెలిసిందే.ఇప్పుడు అదే సమాచారాన్ని ఏఐఎస్ ఫర్ ట్యాక్స్‌పేయర్ యాప్‌లో చూసుకోవచ్చు.టీడీఎస్, వడ్డీ, డివిడెండ్‌లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయపు పన్ను రీఫండ్స్, GST డేటా లాంటి ఇతర సమాచారం యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో మీకు దొరుకుతుంది.
ఇక ఈ యాప్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ లేదా ట్యాక్స్‌పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ యాక్సెస్ చేయొచ్చని కూడా ప్రభుత్వం చెబుతోంది.ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉంది.పన్ను చెల్లింపుదారులకు సులభంగా సేవల్ని అందించడం కోసం ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన యాప్ కావడం విశేషం.ఈ మొబైల్ యాప్ యాక్సెస్ చేయాలంటే పన్నుచెల్లింపుదారులు తమ పాన్ నెంబర్‌తో రిజిస్టర్ కావాలి.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పోర్టల్‌లో కూడా సులువుగా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ యాక్సెస్ చేయొచ్చు.