తెలంగాణ మంత్రి హరీష్ రావు( Harish Rao ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలనపై కాంట్రవర్సీ కామెంట్లు చేయడం తెలిసిందే.తెలంగాణలో నివసిస్తున్న ఏపీ వాళ్లు అక్కడ ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నమోదు చేసుకోవాలని మంత్రి హరీష్ రావు ఇటీవల వ్యాఖ్యలు చేయడం జరిగింది.
వైసీపీ, టీడీపీ పార్టీలు ఏపీ రాష్ట్రని ఆగం చేశాయని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది.
అభివృద్ధి విషయానికొస్తే తెలంగాణకే ఆంధ్రకి ఆకాశానికి భూమికి ఉన్న తేడా అని వ్యాఖ్యానించారు.
దీంతో మంత్రి హరీష్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి.

ఈ వ్యాఖ్యలపై ఉదయం నుండి వైసీపీ నాయకులు కౌంటర్లు ఇస్తున్నారు.తాజాగా బొత్స సత్యనారాయణ ( Botsa Satyanarayana )రియాక్ట్ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి హరీష్ రావు ఎవరని ప్రశ్నించారు.

రాజకీయాల కోసం హరీష్ రావు ఏదైనా మాట్లాడుతారు.ముందు ఆయన వాళ్ళ రాష్ట్రం కోసం చూసుకోవాలని సూచించారు.తాము రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తున్నామో… ప్రజలకు తెలుసని.స్పష్టం చేశారు.ఇన్నాళ్లు లేనిది ఒక్కసారిగా ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారని.మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.







