ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో చోటు చేసుకున్న ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.ప్రమాదంలో ఇద్దరు చనిపోవడం బాధాకరమని తెలిపారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వర రావుకు ఫోన్ చేసిన కేసీఆర్ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారు.
అదేవిధంగా క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు.







