ఓ మహిళ తన అక్రమ సంబంధం( Illegal Relationship ) భర్తకు తెలియడంతో.ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది.
పోలీసుల విచారణలో అసలు విషయాలు బయటపడడంతో మృతుడి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.వివరాల్లోకెళితే మురపాక గ్రామానికి చెందిన రాము (42), కుమారి దంపతులు కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు.
వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం.అయితే కుమారి శ్రీకాకుళం పట్టణానికి చెందిన దారపు ప్రసాద్ వద్దకు కూలి పనులకు వెళ్లేది.
ఈ క్రమంలో దారపు ప్రసాద్ తో( Darapu Prasad ) కుమారికి( Kumari ) పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది.కుమారి అక్రమ సంబంధం భర్త రాముకు తెలియడంతో కుమారిని ఇలాంటి పనులు మానుకోవాలని మందలించాడు.
ఎప్పటికైనా భర్త అక్రమ సంబంధానికి అడ్డే అని భావించిన కుమారి, ప్రియుడు ప్రసాద్ సహాయంతో భర్తను హత్య చేయాలని నిర్ణయించుకుంది.ప్రసాద్ తన స్నేహితులైన సతీష్ కుమార్, కిరణ్ ల సహాయంతో మార్చి 31న రామును హత్య చేసేందుకు బయ్యన్న పేట జంక్షన్ వద్ద మాటు వేయగా, రాము ఆరోజు ఆ దారిలో వెళ్లకపోవడంతో తిరిగి వెళ్ళిపోయారు.

ఆ మరుసటి రోజు తెల్లారుజామున రాము బైక్ పై వస్తుండగా ప్రసాద్, సతీష్ కుమారులు మరొక బైక్ తో పెద్దరావుపల్లి గెడ్డ ప్రాంత సమీపంలో బలంగా ఢీకొట్టారు.వెంటనే రాము కింద పడిపోతే ప్రసాద్ పక్కకు ఈడ్చుకొని వెళ్లి సతీష్ కుమార్ సహాయంతో గొంతు నులిమి చంపి అక్కడనుండి పరారయ్యారు.పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

కానీ ఈ నెల 10న పోస్టుమార్టం రిపోర్ట్ లో హత్యగా తేలడంతో పోలీసులు అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో దారపు ప్రసాద్, సతీష్ కుమార్, కిరణ్ లను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా కుమారి బండారం బయటపడింది.పోలీసులు వీరిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.







