నందమూరి నట సింహం బాలయ్య( Balakrishna ) కుమారుడు అయిన మోక్షజ్ఞ( Mokshagna ) ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చిరంజీవి కొడుకు అయిన రామ్ చరణ్ నాగార్జున ఇద్దరు కొడుకులు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చారు ఇక దానితో మోక్షజ్ఞ ఎప్పటి నుంచో అందరి దృష్టి మోక్షజ్ఞ ఎంట్రీ పైనే పడింది ఎప్పుడెప్పుడా అని నందమూరి ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.బాలయ్య సైతం 2023లోనే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని ఫ్యాన్స్ కు హామీ ఇవ్వడం జరిగింది.ఆదిత్య369 సీక్వెల్ ఆదిత్య 999 మ్యాక్స్( Aditya 999 Max ) సినిమాతో మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.ఈ సినిమా డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు వేర్వేరు సమాధానాలు వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే నందమూరి ఫ్యాన్స్ ఎదురుచూపులకు తగిన ఫలితం ఎప్పుడు లభిస్తుందో అనేది కీలకమే .మోక్షజ్ఞ మీడియాకు దూరంగా ఉంటున్నారు.అయితే మోక్షజ్ఞ ఇప్పటినుంచే తన వీడియోల ద్వారా, ఇంటర్య్వూల ద్వారా అభిమానులకు దగ్గరైతే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని బాలయ్య చెప్పుకొచ్చారు.
అయితే ఆ హామీ ఈ ఏడాదే నెరవేరుతుందో లేదో క్లారిటీ రావడం లేదు.
మోక్షజ్ఞ వయస్సు ప్రస్తుతం 28 సంవత్సరాలు .మోక్షజ్ఞ భిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మోక్షజ్ఞ మాస్ ఇమేజ్ పై దృష్టిపెడతారో లేక క్లాస్ ఇమేజ్ పై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.
మోక్షజ్ఞ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు.
మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది.మోక్షజ్ఞ తొలి సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో సొంత బ్యానర్ లో తెరకెక్కనుందని తెలుస్తోంది.బాలయ్య ఎన్టీఆర్ సపోర్ట్ ఉంటే మోక్షజ్ఞ స్టార్ హీరో కావడం కష్టం కాదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మోక్షజ్ఞ తొలి ప్రాజెక్ట్ లో రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటిస్తారని వార్తలు వస్తున్నాయి.అది త్వరలోనే పట్టాలెక్కడం ఖాయమని తెలుస్తుంది…