రాజన్న సిరిసిల్ల జిల్లా: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు జ్యోతిరావు పూలే అని… అతని జీవితం మనందరికీ స్ఫూర్తి దాయకం అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.మంగళవారం మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి వేడుకలను సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ లో జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ లతో కలిసి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది ఫూలే అంటూ వారి సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి మాట్లాడుతూ.కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని పూలే భావించారని అన్నారు.
అంటరానితనం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని ఆమె అన్నారు.మహిళలు చదువుకుంటేనే అసమానతలు తొలగిపోతాయని భావించి మొదట తన భార్య సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసిన గొప్ప ఆచరణ వాది అని అన్నారు.
సమాజ పునర్నిర్మాణానికి పూలే చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.పూలే ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున గురుకులాలు ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యత తో కూడిన విద్యను అందిస్తుందన్నారు.
బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తుందనీ జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి తెలిపారు.వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందిపుచ్చుకుని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో మరింతగా ఎదగడమే పూలే గారికి నిజమైన నివాళులు అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి అన్నారు.
జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.దేశంలోని వెనుకబడిన వర్గాలతో పాటు నిమ్నజాతుల కోసం పోరాటం చేసి విజయం సాధించిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతీరావు పూలే అని కొనియాడారు.
ఆయన జీవితమే మనకు ఒక సందేశం అన్నారు .వర్ణ, కుల, లింగ వివక్షపై పోరాడి ప్రజలను చైతన్యపరిచార ని అన్నారు.వెనుకబాటుకు మూలం సమాజంలో సగభాగమైన మహిళలు విద్యకు దూరమవడమే కారణమని భావించి, స్త్రీలకు ప్రత్యేకంగా పూలే తన సతీమణి సావిత్రి బాయ్ పూలే తో కలిసి పాఠశాలలు ప్రారంభించారని కొనియాడారు.జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, మానవాతావాది అని వారి సేవలను వారి సేవలను భారత దేశం స్మరించుకుం టుదన్నారు.
జ్యోతి రావు పూలే గురించి ఎంత చెప్పినా తక్కువే అని.వారి స్ఫూర్తిగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల పేద ప్రజలకు చివరి గడపకు చేరేలా జిల్లా యంత్రాంగం తరపున కృషి చేస్తామని చెప్పారు .ఈ కార్యక్రమంలో రాష్ట్ర పవర్‌లూం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా బిసి అభివృద్ది అధికారి మోహన్ రావు, జిల్లా రవాణా అధికారి కొండల్ రావు, జిల్లా కార్మిక అధికారి రఫీ , డీపీఆర్ ఓ మామిండ్ల దశరథం, బిసి సంఘాల ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు
.






