బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీకి పయనం కానున్నారు.తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును బీజేపీలో చేర్చుకునే దిశగా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ బీజేపీ కమిటీ ఛైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ దీనిపై పెద్దలతో చర్చించనున్నారు.జాతీయ నేతలతో ఆయన సమావేశమై ఇరువురు నేతలను పార్టీలోకి ఆహ్వానించడంపై ప్రధానంగా చర్చించనున్నారని సమాచారం.