చిత్తూరు జిల్లాలో( Chittoor ) ఘరానా మోసం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.రూ.లక్ష రూపాయలు కడితే నెలకు రూ.40వేల రూపాయలు పొందడంతో పాటు మూడు సంవత్సరాల తరువాత పెట్టుబడి రూ.లక్ష వెనక్కుకు ఇస్తామని, లక్ష రూపాయలు కట్టినందుకు బాండు ఇస్తాం అని తెలుపడంతో ఓ బ్యూటీషియన్ ( Beautician ) రూ.45 లక్షలు చెల్లించి దారుణంగా మోసపోయింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తూరు నగరంలో చేపల మార్కెట్ కు చెందిన అనురాధ కొంగారెడ్డి( Anuradha Kongareddy ) పల్లెలో బ్యూటీషియన్ గా పనిచేస్తుంది.బజారులో ఉన్న ఏవోజీ అనే కంపెనీలో పెట్టుబడి రూపంలో డబ్బులు డిపాజిట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని తన బంధువు చెప్పడంతో అనురాధ ఏవోజీ కంపెనీకి వెళ్లి ఆరా తీయగా

రూ.లక్ష పెట్టుబడి పెడితే ప్రతి వారం రూ.10 వేల రూపాయలు వడ్డీ రూపంలో పొందడంతో పాటు మూడు సంవత్సరాల తర్వాత పెట్టుబడి పెట్టిన రూ.లక్ష రూపాయలు వెనకకు ఇస్తామని, కానీ కంపెనీ రూల్స్ ప్రకారం మొదటి మూడు నెలల వరకు వడ్డీ రాదని నాలుగో నెల నుంచి కంపెనీ మొత్తం వడ్డీ చెల్లిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.మంచి లాభాలు వస్తాయి కదా.పైగా కట్టిన డబ్బులకు బాండ్ కూడా ఇస్తారని గుడ్డిగా నమ్మిన అనురాధ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి పెద్ద మొత్తంలో లాభాలు పొందాలని నిర్ణయించుకుంది.

అందుకోసం ఇంట్లో ఉన్న అన్ని బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి, తెలిసిన వారందరి దగ్గర అప్పు తీసుకుని ఏవోజీ కంపెనీలో ఏకంగా రూ.45 లక్షలు పెట్టుబడి పెట్టింది.మూడు నెలల తర్వాత వడ్డీ డబ్బులు తీసుకుందామని కంపెనీకి వెళ్లిన అనురాధ ఒక్కసారిగా షాక్ అయ్యింది.
కంపెనీ బోర్డు తిప్పేయడంతో తాను మోసపోయిన విషయం గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.సీఐ నరసింహారాజు కేసు నమోదు చేసుకుని, కంపెనీలో పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసిన వారికి ఇంకా అసలు విషయం తెలియదని, బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై కూడా కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.







