సమంత ప్రస్తుతం శాకుంతలం( Shaakuntalam ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా సమంత( Samantha ) వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈమె తన కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్న విషయం మనకు తెలిసిందే.ప్రేమ వివాహం చేసుకొని కొన్ని సంవత్సరాలు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న నాగచైతన్య( Naga chaitanya )తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు( Divorce ) తీసుకున్నారు.విడాకుల నుంచి బయటపడి ఈమె సినిమాలలో నటిస్తూ ఉండగా మయోసైటిసిస్ వ్యాధి( Myositis ) తనని వెంటాడింది.ఇలా సమంత తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి.
ఈ క్రమంలోనే తన జీవితంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఒకప్పుడు నా జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవు చాలా హ్యాపీగా ఉన్నాను.అయితే నేను కూడా నా జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది.ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైనా సమస్య వస్తే వాళ్లు ఆ సమస్యను ఎదుర్కోవడానికి మరింత స్ట్రాంగ్ అవుతూ ఉంటారు.
ఈ విషయంలో నేను ప్రత్యేకం అనుకోవడం లేదు.
అయితే నా జీవితంలో నాకు కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఎదురయ్యాయి.అయితే ఆ సమస్యలు నా జీవితాన్ని నాశనం చేయకూడదు అనుకుని నేను మరింత స్ట్రాంగ్ అయ్యానని ఈ సందర్భంగా సమంత చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.