ట్విట్టర్ వేదికగా నేడు రెండు సార్లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతినీ అభినందించిన మంత్రి కేటిఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఒకే రోజు రెండు సార్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందనలు అందుకున్నారు.అది రాష్ట్ర మంత్రి కే టి ఆర్ నుంచి… అరుదైన ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది.

 Minister Ktr Appreciated Rajanna Siricilla Collector Anurag Jayanthi On Twitter,-TeluguStop.com

సోమవారం మంత్రి కే టి ఆర్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం గండిలచ్చ పేటలో గ్రామంలో చెదల దుర్గయ్య,చెదల సుమన్ లు తండ్రి కొడుకులు ఉమ్మడిగా దళిత బంధు నిధులతో పౌల్ట్రీ ఫారం ఏర్పాటు చేశారు.

ఫౌల్ట్రీ ఫారం ఫోటోలను తన ట్విట్టర్ లో జిల్లాకు వచ్చే ముందు ఉదయం మంత్రి కే తారక రామారావు పోస్ట్ చేస్తూ ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కి అభినందలు తెలిపారు.

ఇదే రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటన సందర్భంగా రాష్ట్రంలోనే మొట్ట మొదటి సారిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో ఏర్పాటు చేసిన పీజీయోథెరపీ సేవల ను తంగళ్ళపల్లి మండల కేంద్రం పీహెచ్ సి లో రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రారంభించారు.

అనంతరం ఈ ఫోటోలను జిల్లా కలెక్టర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ ట్వీట్ ను రిట్వీట్ చేసిన మంత్రి శ్రీ కే తారక రామారావు … ఇది ఆలోచనాత్మకమైన చొరవ.

వెల్ డన్ కలెక్టర్ అనురాగ్ అంటూ ప్రశంసించారు.

ట్విట్టర్ వేదికగా ఒకేరోజు రెండు సార్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ మంత్రి కే తారక రామారావు అభినందించడం పట్ల సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు షేర్ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నీ అభినందిస్తున్నారు.

మంత్రి కే టి ఆర్ ఒక్కసారి అభినందిస్తే…చాలు అని భావించే ఈ రోజుల్లో… మీరు రెండు సార్లు అభినందన లు లభించడం మీ పని తీరుకు నిదర్శనం…మీరు ప్రశంస కు పూర్తిగా అర్హులు అంటూ జిల్లా కలెక్టర్ కు నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube