వరంగల్ సీపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.నల్గొండ, ఖమ్మంలో ఏం చేశావో తెలుసని చెప్పారు.
అదేవిధంగా విజయవాడ సత్యంబాబు కేసులో సీపీ పాత్ర ఏంటో తెలుసని వెల్లడించారు.ఈ క్రమంలోనే సీపీ ఆస్తిపాస్తుల చిట్టా బయటకు తీస్తానని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణకు ఏం చేశారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.ఉద్యోగులకు జీతాలు ఇవ్వమన్న, రుణమాఫీలు చేయమన్న డబ్బులు లేవంటారని విమర్శించారు.
ఈ నెల 15న వరంగల్ లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని తెలిపారు.టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాలన్న బండి సంజయ్ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.







