తెలంగాణ గవర్నర్ తమిళిసై వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొన్ని బిల్లులకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఆ వివరాలు న్యాయస్థానానికి సమర్పించారు.మూడు బిల్లులను గవర్నర్ 2022 సెప్టెంబర్ నుంచి పెండింగ్ లో ఉంచారని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.
ఏప్రిల్ 9, 2023న సుప్రీంకోర్టుకు గవర్నర్ సచివాలయం నివేదిక ఇచ్చింది.కొన్ని బిల్లులపై ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారని కోర్టుకు అందించిన నివేదికలో గవర్నర్ సచివాలయం పేర్కొంది.
పంచాయతీ రాజ్ చట్ట సవరణ, ఆజామాబాద్ ఇండస్ట్రీయల్ ప్రాంత చట్ట సవరణ బిల్లులపై ఇంతవరకు న్యాయశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదని గవర్నర్ సచివాలయం తెలిపింది.ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.







