ఇటీవల కాలంలో చాలామంది విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతోమంది విఫలం అవుతున్నారు.
ఒకటికి పది సార్లు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే ప్రమాదాలలో పడుతుంటే.క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు.
అయితే ఓ వ్యక్తి పీకల దాకా మందు తాగి( Drunk ) ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు.దానికి సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

వివరాల్లోకెళితే కర్ణాటకలోని( Karnataka ) మైసూర్ జిల్లా హుణసురు లోని తోండాళు గ్రామానికి చెందిన రాజశెట్టి (40) అనే వ్యక్తి శనివారం రాత్రి పీకల దాకా మద్యం సేవించి, ఇంటికి వెళ్లే క్రమంలో కనిపించిన గ్రామస్తులపై గొడవ పెట్టుకున్నాడు.స్థానికులు అంతా రాజశెట్టి ను( Rajashetty ) మందలించి, అతనిని ఇంటిదగ్గర వదిలిపెట్టి వెళ్లారు.
మద్యం మత్తులో ఉన్న రాజశెట్టి తనను గ్రామస్తులంతా మందలించారని కాస్త మనస్థాపం చెంది ఇంటి దగ్గర కేకలు వేస్తూ కాసేపు హల్ చల్ చేశాడు.క్షణికావేశంలో తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయిన రాజశెట్టి పక్కనే ఉన్న కొడవలితో తన మర్మాంగాన్ని కోసుకొని ఒకసారిగా కింద పడిపోయాడు.

కుటుంబ సభ్యులు రాజశెట్టి ని గమనించి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వైద్యులు పరీక్షలు నిర్వహించి, ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.ప్రస్తుతం రాజశెట్టి చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు.సమాచారం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన పోలీసులు హాస్పిటల్ కు చేరుకొని జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను విచారించారు.
ఈ సంఘటన గ్రామమంతా తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.క్షణికావేశంలో రాజశెట్టి పిచ్చి పని చేశాడంటూ బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని అందరిని విచారించే పనిలో పడ్డారు.







