Renu Desai: పవన్ కళ్యాణ్ తో విడాకులపై రేణు దేశాయ్ వైరల్ కామెంట్స్.. ఏం అన్నారంటే?

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai ) 2012లోనే విడాకులు తీసుకున్న విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.విడాకులు తీసుకుని విడిపోయినప్పటికీ పిల్లల కోసం తల్లిదండ్రులుగా కొనసాగుతూనే ఉన్నారు.

 Renu Desai Sensational Post On Divorce With Pawan Kalyan-TeluguStop.com

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కూడా సమయం దొరికినప్పుడల్లా పిల్లలతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు.అయితే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడాకులు తీసుకొని వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ప్రస్తావించలేదు.

కానీ విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ దారుణంగా ట్రోలింగ్స్ జరిగిన విషయం తెలిసిందే.తనపై ఎంతమంది ఎన్ని విధాలుగా విమర్శలు చేసిన రేణు దేశాయ్ ఖండిస్తూ వచ్చింది తప్ప అసలు విషయం ఏంటి అనేది ఎప్పుడు వెల్లడించలేదు.

కానీ మొట్టమొదటిసారిగా రేణు దేశాయ్ తన విడాకుల విషయం గురించి సంచలన పోస్ట్ చేసింది.పవన్ తో విడిపోయిన ఇన్నేళ్లకు తనని అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారని, అందుకు తనకు ధైర్యం వచ్చింది అంటూ సంచలన పోస్ట్ చేసింది.

తాజాగా రేణు దేశాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమారి తన గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన వీడియోని షేర్ చేసింది.ఆ వీడియోలో కృష్ణకుమారి మాట్లాడుతూ.

భార్య భర్తలు విడిపోయినప్పుడు సమాజం ముందు మహిళలు మాత్రమే ధిక్కార స్వరానికి గురవుతున్నారు అని కృష్ణ కుమారి అన్నారు.పైకి గంభీరంగా కనిపిస్తున్నా అలాంటి మహిళలు ఎంతో వేదన అనుభవిస్తుంటారు.

ఉదాహరణగా పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోవడాన్ని ప్రస్తావించారు.

హీరో హీరోయిన్లు విడిపోయినప్పుడు ఎక్కువ ట్రోలింగ్ కి గురయ్యేది హీరోయినే.మహిళలు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనే కోణంలో సమాజం ఆలోచిస్తోంది.ఈ కారణంగా మహిళలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు.

రేణు దేశాయ్ విషయమే తీసుకోండి ఆమె ఎవరినో పెళ్లి చేసుకోబోతోంది అని వార్తలు రాగానే ట్రోలింగ్ మొదలు పెట్టారు.పెళ్లి ఎలా చేసుకుంటావ్.నువ్వు మా వదినవి అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేసారు.పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సహజీవనం చేసి ఒక బిడ్డని కనేందుకు కూడా అంగీకరించింది.

అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు.రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది.

ఆ రోజు రేణు దేశాయ్ నాకు కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.ఏ గుడిలోనో, ఇంకెక్కడో పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది అంటూ కృష్ణ కుమారి పెను సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆ వీడియో కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.అందుకు సంబంధించిన వీడియోని రేణు దేశాయ్ షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.ఈవిడ ఎవరో నాకు తెలియదు.నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు.

కానీ మొదటిసారి పబ్లిక్ లో నా తరుపున మాట్లాడడం విని చాలా ఏడ్చాను.నేను ఏదైనా మాట్లాడితే ఎదో ఒక పొలిటికల్ పార్టీకి అమ్ముడయ్యాను అని అంటారు.

ఇది ఎలక్షన్ టైం అని అంటారు.కానీ ఈ వీడియో చూసిన తర్వాత నా భాద అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారనే ధైర్యం నాకు వచ్చింది అంటూ రేణు దేశాయ్ రాసుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube