బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్( Salman Khan ) హీరోగా నటించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రం ఈనెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.రంజాన్ సందర్భంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేసినందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందుకు కారణం వెంకటేష్ కీలక పాత్రలో నటించడంతో పాటు రామ్ చరణ్( Ram Charan ) ఈ సినిమా లో ఒక పాటలో కనిపించబోతున్నాడు.
సల్మాన్ ఖాన్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ ఉంది.సినిమా లో తెలంగాణ నేపథ్యం ముఖ్యంగా బతుకమ్మను చూపిస్తూ ఉండడం వల్ల తెలుగు రాష్ట్రాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ హిందీ సినిమాలకు పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో ఆదరణ లేదు.అయినా కూడా ఈ సినిమా ను తెలుగు లో డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తామంటూ మేకర్స్ చెప్తున్నారు.
గతంలో కాటమ రాయుడు ఇదే కథ తో వచ్చింది.కనుక సల్మాన్ ఖాన్ చేసినంత మాత్రాన ప్రేక్షకులు చూస్తారా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.బతుకమ్మను పెట్టిన వెంకటేష్ నటించినంత మాత్రాన… రామ్ చరణ్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చినంత మాత్రాన ఈ సినిమా ను చూసేందుకు ప్రేక్షకులు ముందుకు వస్తారు అని నమ్మకం లేదు అంటూ కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సల్మాన్ ఖాన్ కి ఉన్న ఆదరణ నేపథ్యంలో ఆయన తెలుగు సినిమాల్లో నటిస్తే పర్వాలేదు కానీ ఇతర భాషల సినిమాలను తెలుగు లో విడుదల చేసి చూడమంటే మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకులు చూడరు అనే అభిప్రాయాన్ని మీడియా వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలపై తెలుగు ప్రేక్షకుల అస్సలు ఆసక్తి చూపించడం లేదు.ఆ మధ్య విడుదలైన పఠాన్ సినిమా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మినిమం కలెక్షన్స్ ని కూడా రాబట్ట లేక పోయింది.
అంత సూపర్ హిట్ సినిమానే తెలుగు ప్రేక్షకులు పక్కన పెట్టారు.అలాంటిది ఈ సినిమా ని ఎంత వరకు జనాలు ఆదరిస్తారు అనేది అనుమానమే.