ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్( Prasanth Kishor ) అందరికి సుపరిచితుడే.దేశంలో అనేక రాష్ట్ర ఎన్నికలను ఒంటిచేత్తో గెలిపించిన అద్భుతమైన స్ట్రాటజిస్ట్.2014 ఎన్నికల సమయంలో మోడీ ప్రధాని కావడంలో కీలకపాత్ర పోషించారు.2019 ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్( CM Jagan ) ముఖ్యమంత్రి కావటంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు బాగా వర్క్ అవుట్ అయ్యాయి.ఇదిలా ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకాల ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు( MLA Raghunandan ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

పీకే సలహాలతోనే కేసీఆర్ ప్రధాని మోడీతో కయానికి కాలు దువ్వుతున్నారని ఆరోపించారు.దేశంలో అన్ని రాష్ట్రాలను ప్రధాని మోడీ సమన్యాయం దృష్టిలో చూస్తున్నారని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు.ప్రతిపక్షాలను కూడా ఆహ్వానించి మా సంస్కృతిని తెలియజేసాము అని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని మోడీకి సాదర స్వాగతం పలికితే.కేసీఆర్ ఎందుకు పలకటం లేదని రఘునందన్ రావు నిలదీశారు.
ఇదంతా ప్రశాంత్ కిషోర్ ఆలోచనల మేరకు కేసీఆర్… కేంద్రంతో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు.







