మొటిమలతో మదన పడుతున్నారా? అవి మీ చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయా? మొటిమల కారణంగా చర్మంపై మచ్చలు( Scars ) ఏర్పడుతున్నాయా? ఎన్ని ప్రయత్నాలు చేసినా మొటిమలు మిమ్మల్ని వదిలిపెట్టడం లేదా? అయితే అసలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్ ను రోజు నైట్ పాటిస్తే మొటిమలు( Pimples ), వాటి తాలూకు మచ్చలు పరార్ అవ్వడమే కాదు మళ్లీ మళ్లీ అవి మీ దరిదాపుల్లోకి రాకుండా సైతం ఉంటాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ టిప్ ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక కప్పు ఫ్రెష్ వేపాకు( Neem Leaf ), పది నుంచి పదిహేను పుదీనా ఆకులు( Mint Leaves )( వేసుకోవాలి.అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్, ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసేంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ ను ఐస్ ట్రేలో నింపుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఆ తర్వాత తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్( Ice cubes ను తీసుకొని ముఖానికి రబ్ చేసుకోవాలి.
ఆపై నిద్రించాలి.రోజు నైట్ ఈ టిప్ ను పాటిస్తే కనుక మొటిమలు, వాటి తాలూకు మచ్చలు దెబ్బకు పరార్ అవుతాయి.
అలాగే రెగ్యులర్ గా ఐస్ క్యూబ్స్ తో ముఖంపై మర్దనా చేసుకుంటే మొటిమలు తరచూ వేధించకుండా సైతం ఉంటాయి.
అంతేకాదు, ఈ టిప్ ను పాటించడం వల్ల ఓపెన్ పోర్స్( Open Pores క్లోజ్ అవుతాయి.
ఉదయానికి ముఖ చర్మం గ్లోయింగ్ గా, షైనీ గా మెరుస్తుంది.డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.చర్మం బిగుతుగా మారుతుంది.ముడతలు ఏమైనా ఉన్నా సరే మాయం అవుతాయి.
కాబట్టి ఎవరైతే మొటిమల సమస్యకు దూరంగా ఉండాలని భావిస్తున్నారో తప్పకుండా పైన చెప్పిన సింపుల్ టిప్ ను పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.