ఏపీలో ప్రస్తుతం సెల్ఫి పాలిటిక్స్( TDP Selfie politics ) కొత్త ట్రెండ్ గా మారింది.ప్రతిపక్ష టీడీపీ తెరతీసిన ఈ సెల్ఫి పాలిటిక్స్ ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
వచ్చే ఎన్నికలు టీడీపీకి డూ ఆర్ డై లాంటివి కావడంతో ఈసారి ఎలాగైనా గెలవలనే పట్టుదలలో తెలుగుదేశం పార్టీ ఉంది.అందుకు తగ్గట్టుగానే వ్యూహరచన చేస్తూ జగన్ సర్కార్ ను ఇరకాటంలో పెట్టె విధంగా చంద్రబాబు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు.
అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునే పనిలో ఉన్నారు.ఇక ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పుంజుకోవడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న చంద్రబాబు.
వైసీపీకి కొత్తకొత్త సవాళ్ళు విసురుతూ సరికొత్త రాజకీయానికి తెరతీస్తున్నారు.

అందులో భాగంగానే ఇప్పుడు సెల్ఫి ఛాలెంజ్ విసురుతున్నారు చంద్రబాబు.ఆయన హయంలో జరిగిన అభివృద్ది పనులను.ప్రాజెక్ట్ లను, పరిశ్రమలను సెల్ఫి లు తీసి సోషల్ మీడియాల్లో పోస్టు చేస్తూ మీరు తెచ్చిందేంటి.
చేసిందేంటి అనే ప్రశ్నలను జగన్ సర్కార్ పై సంధిస్తున్నారు.దీనిపై వైసీపీ శ్రేణులు( YCP ) కూడా మౌనం పటిస్తుండడంతో టీడీపీ మరింత దూకుడుగా వ్య్వాహరిస్తోంది.
కియా కంపెనీ, టిడ్కో ఇల్లు పలు హైవేలు.ఆయా పార్కులు ఇలా టిడిపి హయంలో వచ్చిన ప్రతిదానిని కూడా సెల్ఫి తీసి.
ఇలా తీసి చూపించే దమ్ము జగన్ సర్కార్ కు ఉందా అంటూ సవాళ్ళు విసురుతున్నారు.అయితే టీడీపీ చేస్తున్న ఈ సెల్ఫి రాజకీయాలను తప్పుబడుతోంది వైసీపీ వర్గం.

ఇదొక సెల్ఫిష్ రాజకీయమని.సిఎం జగన్( CM JAGAN ) చేస్తున్న అభివృద్దిని ఓర్వలేకే చంద్రబాబు అంతా తానే చేసినట్లుగా చెప్పుకుంటున్నారాని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.అయితే వైసీపీ సొ సొ గా విమర్శలు చేస్తున్నప్పటికి టీడీపీ చేస్తున్న ఈ సెల్ఫి పాలిటిక్స్ జగన్ ను ఇరకాటంలో పెట్టె విధంగానే ఉన్నాయనేది కొందరి అభిప్రాయం.ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమంపైన పెట్టిన దృష్టి.
రాష్ట్రాన్ని అభివృద్ది చేయడంపై ఉంచలేదని, అందుకే చంద్రబాబు చేస్తున్న అభివృద్ది సవాళ్ళకు వైసీపీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ రావడంలేదనే అభిప్రాయం కొందరిలో ఉంది.అయితే ఎన్నికలు దగ్గర పడుతూన్న వేళ ఇలాంటివి మేజర్ హైలెట్ అయితే ఆ ప్రభావం వైసీపీపై గట్టిగానే చూపే అవకాశం ఉంది.
మరి టీడీపీ చేస్తున్న సెల్ఫి పాలిటిక్స్ కు వైసీపీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.







