బీజేపీతో జనసేన పొత్తులో ఉందనే సంగతి అందరికీ తెలిసిందే.దీనిపై అటు పవన్ ఇటు ఏపీ బీజేపీ( AP BJP ) నేతలు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు కూడా.
అయినప్పటికి పవన్( Pawan kalyan ) అస్థిరత్వం కారణంగా ఈ రెండు పార్టీల పొత్తుపై ఎప్పటికప్పుడు అనుమానాలు వస్తూనే ఉన్నాయి.వైసీపీ వ్యతిరేక ఓటు చిలనివ్వమని పదే పదే చెబుతున్నా పవన్.
అందుకోసం ఏం చేయడానికైనా సిద్దమే అనే సంకేతాలను ఇస్తున్నారు.టీడీపీతో కలవడంపై కూడా పరోక్షంగా క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.
అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు.టీడీపీ( TDP 0తో కలిసేందుకు బీజేపీ సంతృప్తిగా లేదు.
దాంతో పవన్ టీడీపీ వైపు వెళతారా ? బీజేపీ తోనే ఉంటారా ? అనేది ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే నిలుస్తోంది.

అయితే పవన్ విషయంలో బీజేపీ ఫుల్ క్లారిటీగానే ఉన్నట్లు తెలుస్తోంది.ఆ మద్య జనసేన బహిరంగ సభలో బీజేపీ పట్ల పవన్ తటపటాయించారు.దీంతో పవన్ పొత్తులో ఉంటాడో ఉండడో అనే దానిపై బీజేపీ నేతల్లో కూడా సందిగ్ధం నెలకొంది.
అయితే అనూహ్యంగా ఇటీవల డిల్లీ పెద్దలతో పవన్ భేటీ కావడంతో పొత్తుకు వచ్చిన ఢోకా ఏం లేదని అర్థమైపోయింది.దీంతో రానున్న ఎన్నికల్లో పవన్ ను ఎలా వాడుకోవాలనే దానిపై బీజేపీ కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒక్క ఏపీలోనే కాకుండా తెలంగాణ, కర్నాటకలో కూడా బీజేపీ తరుపున పవన్ ను రంగంలోకి దించేందుకు కమలనాథులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారట.

వచ్చే నెలలో కర్నాటక ఎలక్షన్స్( Karnataka elections ).ఆ తరువాత మరో ఐదు నెలలకు తెలంగాణ ఎలక్షన్స్, ఆ వెంటనే మరో మూడు నాలుగు నెలల్లో ఏపీ ఎలక్షన్స్.ఇలా అన్నిటిలో కూడా పవన్ ను వాడుకునేందుకు బీజేపీ సిద్దమైనట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాటలను బట్టి చూస్తే ఇదే అర్థమౌతుంది.అవసరమైతే పవన్ ను తెలంగాణలోనూ, దక్షిణాది రాష్ట్రాలలోనూ ఉపయోగించుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు.
అయితే పవన్ మాత్రం బీజేపీతో పొత్తును ఏపీ వరకు మాత్రమే పరిమితం చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.కానీ మోడీ, అమిత్ షా, నడ్డా లాంటి బీజేపీ పెద్దలు కోరితే ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తరుపున ప్రచారం చేసేందుకు పవన్ సిద్దమైన ఆశ్చర్యం లేదనేది కొందరి వాదన.
మరి పవన్ విషయంలో పక్కా క్లారిటీగా ఉన్న బీజేపీ.రాబోయే రోజుల్లో పవన్ ఇమేజ్ ను ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.







