వైరల్: పెళ్లి వేదికపై బంధువుల చిందులతో బలైపోయిన వధువు... నెటిజన్స్ ఫైర్?

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలలో వివాహానికి పెద్ద పీట వేయబడింది.వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను కలిపే ఒక అద్భుత బంధం.

 Viral: The Bride Who Fell Victim To The Spills Of Her Relatives On The Wedding S-TeluguStop.com

అందుకే మన పెద్దవాళ్ళు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయని తరచూ అంటూ వుంటారు.నేటి వివాహాలు( Marriage ) అనేవి ఎంత హాట్టహాసంగా జరుపుకుంటున్నారో అందరికీ తెలిసిందే.

బంధువులు, స్నేహితుల మధ్య అట్టహాసంగా జరుపుకునే పెళ్లిని వధూవరులు అయితే చాలా ప్రత్యేకంగా తీసుకుంటారు.

మన దేశంలో వివాహాలు అనేవి ఆయా ప్రాంతాల వారి వారి ఆచారాలు, సంప్రదాయాలను బట్టి జరుపుకుంటూ వుంటారు.కులం, వర్గం, మతం, దేశాన్ని బట్టి ఆచారాలు అనేవి మారుతూ ఉంటాయి.ఇక ప్రతి సాంప్రదాయ ఆచారం ఈవెంట్‌లో సరదాలకు అయితే కొదువే ఉండదు.

పెళ్లివేడుకల్లో ఇలాంటి సరదా విషయాలు అనేవి వివాహ వేడుకను మరింత ఉల్లాసంగా మారుస్తాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.

అయితే ఇక్కడ సరదా సన్నివేశం కాస్త కామెడీ అయింది.

వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, వరుడు, వధువు ఇద్దరూ కళ్యాణ మండపంలో కూర్చున్నారు.అయితే అదే మండపంలో ఇంకెక్కడా చోటు దొరకానట్టు వరుడు, వధువు( Bride groom ) ఇద్దరి బంధువులు ‘టగ్ ఆఫ్ వార్’ ఆట మాదిరిగానే ఎర్రటి దుప్పటను నువ్వానేనా అన్నట్టు గట్టిగా లాగడం కనిపిస్తుంది.వారిలో ఒక టీమ్‌ దుప్పట లాగటంలో గెలిచింది.

దాంతో ఎదుటి వారిని లాగుతున్న క్రమంలో ఇరువైపుల బంధువులు పోటాపోటీగా దుప్పట లాగుతూ ఒకరిపై ఒకరు పడిపోవడం జరిగింది.ఈ క్రమంలో వారిలో ఒక వ్యక్తి మొదట పెళ్లి కూతురిపై పడగా, అతనిపై మరో వ్యక్తి పడతాడు.

అలా ఒక్కసారిగా ఓ ముగ్గురు నలుగురు ఆమెపైన పడేసరికి వధువు కింద అప్పడమైపోతుంది.కాగా ఈ వీడియో చూసి నెటిజన్లు బంధువులపై కోపంతో ఊగిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube