ఐపీఎల్ మొదలు అయినప్పటి నుండి చివరి వరకు ప్లేయర్లకు కాసుల పండుగే పండుగ.క్రికెటర్లతో పాటు, అంపైర్లకు, చీర్ లీడర్స్ లకు కూడా భారీ మొత్తంలో వేతనాలు ఉంటాయి.
ఐపీఎల్( IPL ) లో సందడి అట్టహాసంగా జరగాలంటే చీర్ లీడర్స్ ముఖ్యపాత్ర పోషిస్తారు.మ్యాచ్లో ఆటగాళ్లు సిక్స్ కొట్టిన, ఫోర్ కొట్టిన, వికెట్ తీసిన చీర్ లీడర్స్ స్టెప్పులు వేస్తూ సందడి చేస్తూ మ్యాచ్ ఆడే వాళ్ళతో పాటు చూసే వాళ్ళలోను ఉత్సాహాన్ని నింపుతారు.
ఐపీఎల్ మ్యాచ్ లో చీర్ లీడర్స్( Cheer leaders ) లేకపోతే అసలు కిక్కు ఉండదు.బ్యాటర్లు, బౌలర్లు రెచ్చిపోయి అద్భుతంగా ఆడేటట్లు ఈ చీర్ లీడర్స్ ఉత్సాహాన్ని నింపడం కోసం ఫ్రాంచైజీలు వీరికి భారీ మొత్తంలో వేతనాలు చెల్లిస్తాయి.ఒక్కో మ్యాచ్లో ఒక్కో విధంగా వీరు వేతనాలు తీసుకుంటారు.ఐపీఎల్ లో కలకత్తా ఫ్రాంచైజీ( kalcutta Franchise ) మిగతా ఫ్రాన్స్ పేజీల కంటే ఎక్కువగా చీర్ లీడర్స్ కు వేతనాలు చెల్లిస్తోంది.రూ.24 వేల రూపాయలు ఒక్క మ్యాచ్ లో వేతన రూపంలో చీర్ లీడర్స్ కు చెల్లిస్తుంది.ఇక మిగతా ఫ్రాంచైజీలు సగటున రూ.12 వేల నుండి రూ.17 వేల వరకు చెల్లిస్తున్నాయి.ముంబై ఇండియన్స్, బెంగళూరు జట్టు ఫ్రాంచైజీలు చీర్ లీడర్స్ కు ఒక్క మ్యాచ్ లో రూ.20 వేల వేతనం చెల్లిస్తున్నాయి.అంతేకాకుండా మ్యాచ్లో విజయం సాధిస్తే ప్రత్యేక బోనస్ లు కూడా చీర్ లీడర్స్ కు అందిస్తారు.
ఇంకా అదనంగా లగ్జరీగా ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు, మంచి స్టార్ హోటల్లో వసతి, ఫుడ్ సదుపాయాలు ఉంటాయి.కాబట్టి ఐపీఎల్ అంటే కాసుల వర్షం కురిసినట్టే.