టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నేడు అనగా ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ తన 41వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
బన్నీ పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో సందడి సందడి చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే దేశముదురు సినిమాని రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ పుట్టినరోజు( Allu Arjun Birthday ) సందర్భంగా వేర్ ఈజ్ పుష్ప అంటూ విడుదల చేసిన టీజర్ ప్రస్తుతం సెన్సేషన్ గా మారింది.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతూ రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబడుతోంది.
ఇక ఆ టీజర్ ని చూసిన అభిమానులు పుష్ప 2( Pushpa 2 ) అంచనాలకు తగ్గట్టుగానే ఉండబోతోంది అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సుకుమార్ అలాగే మూవీ మేకర్స్ పుష్ప 2 థీమ్, అల్లు అర్జున్ పాత్ర డెప్త్ మరింత తెలిసేలా మూడు నిమిషాల పైన ఉన్న టీజర్ వదిలారు.
ఈ టీజర్ అన్ని భాషల్లో మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతూ సూపర్ క్రేజ్ ని సొంతం చేసుకుంది.ఒక్కసారిగా పుష్ప 2పై హైప్ ఏర్పడింది.

అయితే పుష్ప 2 టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ లోగోలతో కొన్ని అంచనాలు, అంతకి మించిన అనుమానాలు మొదలయ్యాయి.టీజర్ చూసిన తర్వాత అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.జైలు నుంచి తప్పించుకున్న పుష్ప ఓ అటవీ ప్రాంతంలో తలదాచుకుంటున్నట్లు అర్థం అవుతోంది.అలాగే నైట్ విజన్ కెమెరాలో పుష్ప విజువల్స్ మీడియాకి లభిస్తాయి.అక్కడ పుష్ప తన ట్రేడ్ మార్క్ స్టైల్ లో గడ్డం నిమురుకుంటుండగా అప్పుడు తన చిటికెన వేలు మాత్రం నైల్ పాలిష్ తో లేడీస్ తరహాలో కనిపిస్తుంది.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో పుష్ప శత్రువులని చెండాడేందుకు మారువేషంలో అమ్మోరు లాగా చూపించారు.ఈ లుక్ లో అల్లు అర్జున్ చాలా బోల్డ్ గా లేడీ గెటప్ లో ఉంటాడు.అయితే మొత్తంగా ఇవన్నీ గమనిస్తుంటే అల్లు అర్జున్ ఈ మూవీలో ఎక్కువగా మారువేషాల్లో ఉంటాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పోలీసుల నుంచి తప్పించుకోవడం కోసం అల్లు అర్జున్ పార్ట్ 2 లో హిజ్రాగా కూడా కనిపించబోతున్నాడు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.టీజర్ మొత్తంగా సుకుమార్ చిటికెన వేలు గోరు ప్రస్తుతం హైలెట్ అవుతోంది.







