యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( NTR ) ఆర్ ఆర్ ఆర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.గ్లోబల్ స్టార్ గా ఎన్టీఆర్ మంచి పేరును సొంతం చేసుకున్నాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కు కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వం వహిస్తున్నాడు.అందుకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తర్వాత బాలీవుడ్ లో ఎన్టీఆర్ వరుసగా సినిమాలు చేసేందుకు ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతుంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వార్ 2 చిత్రంలో హృతిక్ రోషన్ ( Hrithik Roshan )హీరో గా నటించనుండగా విలన్ పాత్ర లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఆ సినిమా కు ముందే సల్మాన్ ఖాన్ నటిస్తున్న టైగర్ 3 చిత్రం లో కూడా ఎన్టీఆర్ పది నిమిషాల పాత్రలో కనిపించే గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.యశ్ రాజ్ ఫిల్మ్స్ వారు ఎన్టీఆర్ తో చాలా పెద్ద మొత్తానికి ఒప్పందాలు చేసుకున్నారట.
మొత్తానికి ఒకేసారి రెండు బాలీవుడ్ సినిమా లను చేయబోతున్న ఎన్టీఆర్ కి అక్కడి అభిమానులు ఫిదా అవ్వబోతున్నారు.ఆ రెండు సినిమాలు చేస్తే ఇక్కడ నుండి వరుసగా హిందీలోనే ఆయన సినిమాలు చేసిన వర్షాలు ఉన్నాయంటూ అక్కడి మీడియా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో కూడా ఆయన సినిమాలు చేయాలని కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన నేపథ్యం లో ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఆనందం హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్ నుండి ముందు ముందు రాబోతున్న ప్రతి ఒక్క సినిమా కూడా ఆకాశమే హద్దు అన్నట్లుగా భారీ బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ చిత్రాలతో పాటు కన్నడ సూపర్ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఒక సినిమా ను చేయబోతున్న విషయం తెలిసిందే.
ఆ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చింది.ఎప్పుడు ఆ సినిమా ప్రారంభం కాబోతుంది అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.







