వైసీపీ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పేందుకే జగనన్నే మా భవిష్యత్ క్యాంపెయిన్ అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టే ప్రజల వద్దకు వెళ్తున్నామని తెలిపారు.
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని మంత్రి బొత్స వెల్లడించారు.తమ పాలనపై ఐదు ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు.
కుటుంబం పెద్ద అనుమతితో ఇంటికి స్టిక్కర్ వేస్తామని తెలిపారు.పేటెంట్ ఉన్న కార్యక్రమాలు జగన్ కు వంద ఉన్నాయన్న ఆయన చంద్రబాబు పేటెంట్ కార్యక్రమం ఒక్కటైనా ఉందా అని ప్రశ్నించారు.
అదేవిధంగా జనసేన రాజకీయ పార్టీ కాదని, అదో సెలబ్రిటీ సంస్థ అంటూ ఎద్దేవా చేశారు.







