ఎండాకాలంలో డీహైడ్రేషన్( Dehydration ) మరియు హీట్ స్ట్రోక్ సమస్య సర్వసాధారణం.ఈ సీజన్‌లో ఆహారం విషయంలో చాలా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
ముఖ్యంగా బయటకు వెళ్లేటప్పుడు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.మండే ఎండల్లో ఉష్ణోగ్రతలకు చాలా మంది ప్రమాదాల బారిన పడుతుంటారు.
ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎండ వేడిమికి శరీరంలో నీటి శాతం ఆవిరి అయిపోతుంది.దీంతో గొంతు ఎండిపోయి, కళ్లు తిరిగి పడిపోవడం, ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడడం వంటివి జరుగుతుంటాయి.
ఈ సమస్యను నివారించేందుకు పండ్లు, కూరగాయలు( Fruits and vegetables ) సాయపడుతాయి.వీటిలో అధిక శాతంలో నీరు ఉంటుంది.
డీహైడ్రేషన్ బారిన పడకుండా సంరక్షిస్తాయి.వేసవిలో మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే పండ్ల గురించి తెలుసుకుందాం.
పుచ్చకాయను( Watermelon ) చాలా మంది వేసవిలో ఇష్టంగా తింటుంటారు.దీనిలో అధిక మొత్తంలో నీటి శాతం ఉంటుంది.పుచ్చకాయలో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్ ఏ, బీ, సీ పుష్కలంగా లభిస్తాయి.ఇందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది.ఇది శరీరంలో తేమ స్థాయిని పెంచి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది.వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కర్బూజా కూడా సాయపడుతుంది.
దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.ఫలితంగా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
అంతేకాకుండా ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.కంటి చూపునకు, గుండె, జీర్ణ వ్యవస్థకు, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దానిమ్మలో( pomegranate ) మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
ఇవి శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.వాపు, వృద్ధాప్య ప్రభావాలను తగ్గిస్తుంది.ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
ఇవే కాకుండా ద్రాక్ష కూడా వేసవిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఫలంగా పేరొందింది.ఇందులో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది.
ఇది మీ శరీరంలోని ద్రవాలను సమతుల్యం చేయడంలో సహాయపడే ఖనిజం.ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు.
అందేకాకుండా పొటాషియం అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.