తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్( CM KCR ) వ్యూహరచనలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ఆయన అమలు చేసే వ్యూహాలు ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
ఎత్తుకు పై ఎత్తులు వేయడంలోనూ ప్రత్యర్థులు అంచనా వేయలేని ప్రణాళికలు రచించడంలోనూ కేసిఆర్ స్టైలే వేరు.ఇక తాజాగా ఆయన అమలు చేసిన వ్యూహం కూడా ప్రత్యర్థి పార్టీ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న కేసిఆర్.ఈ వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్( Bandi Sanjay ) ని జైలు కు పంపించారు.
కాగా ఈ నెల 8న మోడి తెలంగాణలో పర్యటించనున్నారు.

మోడీ టూర్ కు మూడు రోజుల ముందు బండి సంజయ్ ని జైలుకు పంపించడంతో కేంద్రానికి బయపడే ప్రసక్తే లేదనే సంకేతాలను కేసిఆర్ గట్టిగానే పంపించినట్లైంది.ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో అనుమానితురాలుగా కేసిఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణలో పాల్గొంది.ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ కావడం ఖాయం అని బీజేపీ నేతలుగా గట్టిగానే చెబుతూ వచ్చారు.
కేసిఆర్ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు.ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగానే ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం తెరపైకి రావడం.
ఈ వ్యవహారంలో బండి సంజయ్ పాత్ర ఉందనే ఆరోపణలు రావడం.వెంటనే కేసిఆర్ మారు మాట ఆలోచించకుండా బండి సంజయ్ ను జైలుకు పంపించడం అన్నీ చక చక జరిగిపోయాయి.

ఓవైపు లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) వ్యవహారం తేలకముందే బీజేపీ చీఫ్ బండి సంజయ్ ని ప్రశ్న పత్రాల లీకేజ్( SSC paper leak case ) వ్యవహారంలో అరెస్ట్ చేయడం కేసిఆర్ సర్కార్ కే చెల్లింది.దీంతో కేసిఆర్ చేసిన రివర్స్ అటాక్ కు కమలం పార్టీ పెద్దల మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి.ఈడీ లకు బోడిలకు భయపడేదే లేదని ముందు నుంచి చెబుతున్నా కేసిఆర్.రివర్స్ గా బీజేపీ నేతలనే జైలుకు పంపించడం మోడీకి పరోక్ష హెచ్చరికలే అని కొందరు విశ్లేహ్శకులు చెబుతున్నారు.
మొత్తానికి అంచనాలకు ఆందని రీతిలో కేసిఆర్ వేస్తున్న వ్యూహాలు.డిల్లీ అధిష్టానాన్ని సైతం డైలమాలో పడేస్తున్నాయి.మరి కేసిఆర్ వ్యూహాలకు బీజేపీ ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి.







