గేమ్ ఛేంజర్ కోసం ముందుగా ఆ హీరోని అనుకున్నారు నేనే వద్దని చెప్పాను: దిల్ రాజు

టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దిల్ రాజు(Dil Raju) ప్రస్తుతం పాన్ ఇండియా భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ఈయన తెరకెక్కిస్తున్న సినిమాలలో గేమ్ ఛేంజర్(Game Changer) ఒకటి.

 The Hero Was First Thought Of For The Game Changer I Said No Dil Raju, Dil Raju,-TeluguStop.com

అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా శంకర్( Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ramcharan)హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా ఇప్పటికే 70 శాతం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది.

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయడమే కాకుండా గేమ్ ఛేంజర్ గా రామ్ చరణ్ పోస్టర్ ను కూడా విడుదల చేయడంతో ఈ పోస్టర్ ఒక్కసారిగా వైరల్ అయింది.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ముందుగా శంకర్ తనకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు హీరోగా రామ్ చరణ్ ను కాకుండా మరొక హీరో పేరును తీసుకువచ్చారట.

అయితే ఈ సినిమాకు రామ్ చరణ్ కరెక్ట్ గా సరిపోతారని దిల్ రాజు సలహా ఇవ్వడంతో ఈ సినిమా అవకాశం రామ్ చరణ్ కు వచ్చిందని తెలిపారు.

మరి శంకర్ గేమ్ ఛేంజర్ కోసం ముందుగా అనుకున్న హీరో ఎవరు… ఏంటి అనే విషయానికి వస్తే…ఈ సినిమా పాలిటిక్స్(Politics) ఎలక్షన్స్(Elections) చుట్టూ తిరుగుతూ ఉంటుంది కనుక ఈ సినిమాలో నటించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అయితే కరెక్ట్ గా సరిపోతుందని శంకర్ భావించారట.ఇక ఈ విషయం విన్నటువంటి దిల్ రాజు పవన్ కళ్యాణ్ కన్నా ఈ సినిమాకు రామ్ చరణ్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చారట.ఇక రామ్ చరణ్ కు కథ వివరించే సమయంలో శంకర్ రామ్ చరణ్ కు బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తీసుకురావడానికి సిద్ధమయ్యారని ఈ సందర్భంగా దిల్ రాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube